For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరొక గోల్డెన్ ఛాన్స్ అందుకున్న నవీన్ పొలిశెట్టి.. మొత్తం ఎన్ని సినిమాలంటే?

  |

  జాతి రత్నాలు సినిమాతో బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకున్న నవీన్ పోలిశెట్టి ఆ తర్వాత కూడా అదే తరహాలో విజయాలను కొనసాగించాలని అడుగులు వేస్తున్నాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో పదేళ్ల క్రితం ఒక నెగిటివ్ పాత్రలో కనిపించిన నవీన్ ఆ తర్వాత స్టార్ హోదాను అందుకోవడానికి ఎంతగానో కష్టపడ్డాడు. ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో అనేక స్టూడియోల చుట్టూ తిరిగాడు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో వందల సంఖ్యలో ఆడిషన్స్ కూడా ఇచ్చాడు. కానీ అతనికి అవకశాలు మాత్రం అంత ఈజీగా దక్కలేదు.

  అంతగా కనెక్ట్ అవ్వడం లేదట

  అంతగా కనెక్ట్ అవ్వడం లేదట

  చిచోరే సినిమాతో మొత్తానికి ఒక బ్రేక్ అయితే వచ్చింది కానీ సరైన అవకాశాలు మాత్రం ఇంకా దక్కడం లేదు. అవకశాలు మాత్రం చాలానే వస్తున్నాయి గాని అవేవి కూడా ఈ టాలెంటెడ్ యాక్టర్ కు అంతగా కనెక్ట్ అవ్వడం లేదట. ఒక సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా అదే ఫార్మాట్ లో వెళ్ళాలి అంటే సాధారణ విషయం కాదు. కానీ ఓపికతో మంచి ఆలోచనలతో ముందుకు సాగితే తప్పకుండా మంచి కథలతో బాక్సాఫీస్ హిట్స్ అందుకోవచ్చని నవీన్ పోలిశెట్టి ఆలోచిస్తున్నాడు.

  సైలెంట్ గా వచ్చి బిగ్గెస్ట్ హిట్

  సైలెంట్ గా వచ్చి బిగ్గెస్ట్ హిట్

  మొత్తానికి జాతిరత్నాలు సినిమాతో కెరీర్ కు సరిపోయేంత బాక్సాఫీస్ హిట్ అయితే అందుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా ఒక డిఫరెంట్ కామెడీ జానర్ ను టచ్ చేసి ప్రేక్షకుల మనసులో అలా నిలిచిపోయాడు. సైలెంట్ గా వచ్చి లాక్ డౌన్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టేశాడు. ఇక ప్రస్తుతం అతని ఫోకస్ మొత్తం తదుపరి సినిమాలపైనే ఉంది. ఫస్ట్ సినోమా తర్వాత కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకున్న నవీన్ పోలిశెట్టి ఇప్పుడు మాత్రం వేగం పెంచాలని అనుకుంటున్నాడు.

  అనుష్క సినిమా క్యాన్సిల్ ?

  అనుష్క సినిమా క్యాన్సిల్ ?

  యు.వి.క్రియేషన్స్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కానీ కాంబినేషన్ పై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అనుష్క శెట్టి హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు టాక్ అయితే బాగానే వచ్చింది. అయితే సినిమా కథ అనుకున్నట్లుగా రాలేదని రిజెక్ట్ చేసినట్లు సమాచారం. అనుష్క కూడా ఆ కథపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదని తెలుస్తోంది. అయినప్పటికీ ఈ యూవీ క్రియేషన్స్ లో ఒక సినిమా చేసేందుకు నవీన్ పోలిశెట్టి సిద్ధంగానే ఉన్నాడు. అలాగే అతనికి బడా నిర్మాతల నుంచి రెండు ఆఫర్స్ వస్తున్నాయి.

  Ek Mini Katha Team Hilarious Interview | Santosh Sobhan | Uv Concepts
  మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్?

  మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్?

  ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా లతో భీమ్లా నాయక్ అనే బిగ్ యాక్షన్ సినిమాను నిర్మిస్తున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కూడా నవీన్ పోలిశెట్టి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సితార నిర్మాత నాగ వంశీ ఒక యువ దర్శకుడు చెప్పిన కథకు నవీన్ పోలిశెట్టి ని ఫిక్స్ చేసారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. నవీన్ కూడా కథ నచ్చడంతో సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ హీరో మూడు కథల పై చర్చలు జరుపుతున్నాడు. ఇక వాటిపై వీలైనంత త్వరగా వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాడు.

  English summary
  Naveen polishetty upcoming project with big production house
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X