twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవకాశాలు లేని హీరోయిన్లే మీటూ అంటూ గొడవ.. నవాజుద్దీన్ సిద్ధిఖీ ఫైర్

    |

    మీటూ ఉద్యమాలను నడిపే హీరోయిన్లు, తారలపై బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ మండిపడ్డారు. ఇతర సినిమా పరిశ్రమలతో పోల్చుకొంటే బాలీవుడ్ అంతా సురక్షితమైన, అందమైన ప్రదేశం మరోటి లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. చాలా రోజులుగా క్యాస్టింగ్ కౌచ్‌ అంటూ లైంగిక ఆరోపణలు చేస్తున్న వారిపై నవాజుద్దీన్ మండిపడ్డారు.

    క్యాస్టింగ్ కౌచ్, బంధుప్రీతి అనేది బాలీవుడ్‌లో ఉన్నదంటే నేను ఒప్పుకోను. కేవలం కొందరు పాపులారిటీ కోసమే వార్తల్లోకి ఎక్కుతూ బ్రేకింగ్ న్యూస్ కోసం అనవసరపు ఆరోపణలు చేస్తున్నారు. ఇది మంచి పద్దతి కాదు అని అన్నారు.

    ఒకవేళ ఇలాంటి పరిశ్రమలో ఒకశాతం ఉన్నా.. దాన్ని రాద్దాంతం చేయకూడదు. ఇలాంటి పరిస్థితులు ఇతర పరిశ్రమల్లోనే ఉంటాయి. కేవలం సినిమా పరిశ్రమలో విషయాలనే ఎందుకు హైలెట్ చేస్తున్నారో అర్ధం కావడం లేదు అవకాశాలు లేని కొందరు ఇలాంటి అసత్యపు ప్రచారాలు చేస్తూ పాపులారిటీ కోసం ప్రయత్నిస్తుంటారు అని నవాజుద్దీన్ అన్నారు.

    Nawazuddin Siddiqui serious comments on casting couch

    బాలీవుడ్‌లో బంధుప్రీతి అనేది లేదు. నేను నటుడిగా స్థిరపడ్డానంటే అందుకు కారణం నా ప్రతిభే. నాకు ఇక్కడ బంధువులు లేరు, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఇక్కడ తెలిసిన వారు కూడాలేదు. నీకు టాలెంట్ ఉంటే నీకు పని దొరుకుతుంది. టాలెంట్‌తోపాటు డిసిప్లిన్ కూడా ముఖ్యమని అని నవాజుద్దీన్ సిద్దిఖి అన్నారు.

    తాజాగా భార్య విడాకుల నోటీసులు పంపడంతో నవాజుద్దీన్ సిద్దిఖీ మరోసారి వార్తల్లో నలిచారు. విభేదాల కారణంగా విడిపోవాలని నిర్ణయం తీసుకొన్నాను. నా జీవితం కొనసాగించడానికి భరణం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

    English summary
    Nawazuddin Siddiqui serious comments on casting couch. He said in latest interview that, There is no safer and more beautiful place than the Bollywood industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X