For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ మాట అన్నావంటే చెప్పు తెగుద్ది వెధవా.. టాప్ సెలబ్రిటీపై నిఖిల్ ఫైర్

  |

  టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కేవలం వెండితెరపైనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా మంచి వ్యక్తిగా గుర్తింపు అందుకుంటున్నాడు. సామాజిక బాధ్యతతో ప్రతి విషయం పైన కూడా తనదైన శైలిలో స్పందించే ప్రయత్నం చేస్తున్నాడు. తప్పు జరిగితే ఎవరినైనా సరే ప్రశ్నించడానికి సిద్ధమేనంటూ పదునైన ట్వీట్స్ తో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాడు. ఇక రీసెంట్ గా ఒక పవర్ఫుల్ వ్యక్తిని వెధవ అంటూ సోషల్ మీడియా లో కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఒక దేశ అధ్యక్షుడిని నిఖిల్ ఆ స్థాయిలో కామెంట్స్ చేయడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ ట్వీట్ వైరల్ గా మారింది. గతంలో కూడా పలు సామాజిక అంశాలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడిన విషయం తెలిసిందే.

  మంచి నటుడిగా..

  మంచి నటుడిగా..


  బాల్యం నుంచే నటుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా గుర్తింపు అందుకోవడానికి ఎంతగానో కష్టపడ్డాడు. సొంతంగానే ప్రయత్నాలు చేస్తూ మొదట చిన్న చిన్న పాత్రలో కనిపించాడు. హీరోగా కంటే కూడా మొదట మంచి నటుడిగా గుర్తింపు అందుకోవాలని నిఖిల్ వేసిన అడుగులు అతని కెరీర్ కు చాలా బాగా హెల్ప్ అయ్యింది. ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఎదో ఒక విభిన్నమైన అంశాన్ని హైలెట్ చేస్తూ ఒక వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. నిఖిల్ సిద్ధార్థ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను అందుకుంటున్నాయి. ఏ మాత్రం ఫ్లాప్ వచ్చినా కూడా మళ్ళీ వెంటనే మరో మంచి సినిమాతో ఫామ్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ యువ హీరో ఎంచుకుంటున్న కథనాలు కూడా ఈ మధ్య ఎంతగానో ఆలోచింపజేస్తున్నాయి.

  వైద్య పరంగానే కాకుండా

  వైద్య పరంగానే కాకుండా

  చివరగా వచ్చిన అర్జున్ సురవరం సినిమాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో జరుగుతున్న ఒక మోసాన్ని హైలెట్ చేస్తూ ఒక మంచి పాయింట్ తో ఆలోచింపజేశాడు. ఆ సినిమా నితిన్ ను మళ్లీ సక్సెస్ ట్రాక్లోకి వచ్చేలా చేసింది. అయితే నిఖిల్ హీరోగా ఎంత మంచి గుర్తింపు అందుకున్నా కూడా రియల్ లైఫ్ లో అంతకంటే ఎక్కువగా ఒక మంచి మనిషిగా అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఆ మధ్య కోవిడ్ కష్టకాలంలో చాలా మందికి సహాయం చేసిన విషయం తెలిసిందే. వైద్య పరంగానే కాకుండా ఆర్థికంగా కూడా చాలా మందికి సహాయం చేసే ప్రయత్నం చేశాడు. అందుకు గాను నిఖిల్ హైదరాబాద్ పోలీసు వారి నుంచి ప్రత్యేకమైన గౌరవాన్ని కూడా అందుకున్నాడు.

  దేశ అధ్యక్షుడు వెధవ

  ఇక సోషల్ మీడియాలో చాలా చురుగ్గా కనిపిస్తున్నాడు. ఎవరైనా సహాయం అడిగితే తన వంతు కృషిగా హెల్ప్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందర్నీ కలచివేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ అంశంపై కూడా నిఖిల్ తలపైన శైలిలో స్పందించే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా అమెరికా దేశ అధ్యక్షుడు పై కూడా నిఖిల్ చేసిన వ్యాఖ్యలు అందరినీ షాక్ కు గురి చేశాయి ఆ దేశ అధ్యక్షుడు వెధవ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.

  అఫ్ఘనిస్తాన్.. పరిస్థితి దారుణంగా..

  అఫ్ఘనిస్తాన్.. పరిస్థితి దారుణంగా..

  గత కొన్ని రోజలు క్రితం అఫ్ఘనిస్తాన్ తాలిబన్స్ ఆధీనంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడి నిష్క్రమణతో అక్కడ దుర్భర్బ పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్లు ఎప్పుడు ఎలాంటి దారుణానికి పాల్పడతారో అని అక్కడి జనాలు ప్రాణ భయంతో ఇతర దేశాలకు పారిపోతున్నారు. ఆడవాళ్లు, చిన్న పిల్లలు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ దారుణమైన పరిస్థితి గురించి స్పందించిన నిఖిల్ అమెరికా దేశ అధ్యక్షుడు పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డాడు.

  మిస్టర్ బైడెన్, చెప్పు తెగుద్ది వెధవా..

  మిస్టర్ బైడెన్, చెప్పు తెగుద్ది వెధవా..

  దాదాపు 21 ఏళ్ళు ఓ దేశాన్ని మీరు అనేక ఇబ్బందులకు గురి చేసి చివరికి కొంచెం కూడా ఆలోచించకుండా వదిలేశారు. ఇంకోసారి ఫ్రీడమ్ గురించి మాట్లాడితే మిస్టర్ బైడెన్, చెప్పు తెగుద్ది వెధవా.. అని నిఖిల్ ట్విట్టర్ లో కామెంట్ చేశాడు. దీంతో ఆ ట్వీట్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికా సైన్యం ఆ దేశాన్ని తనకు నచ్చినట్లుగా సవరించుకొని ఇప్పుడు సడన్ గా తప్పుకోవడంతో తాలిబన్లకు అవకాశం ఇచ్చినట్లయింది. ఇది అంతా కూడా అమెరికా పన్నాగమే అంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇక నిఖిల్ సిద్దార్థ్ కూడా అదే స్థాయిలో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.

  Hero Nikhil ఎమోషనల్.. మిగిలింది అదొక్కటే.. అందరికీ ఇచ్చి పడేశాడు!! || Filmibeat Telugu
   సినిమాల విషయానికి వస్తే

  సినిమాల విషయానికి వస్తే

  ఇక ఈ స్టార్ హీరో సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సుకుమార్ రేటింగ్స్ లో 18 పేజెస్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమలో నిఖిల్ కు జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఫినిష్ అయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది త్వరలోనే రెగ్యులర్ ప్రమోషన్ స్టార్ట్ చేసి సినిమా విడుదల తేదీని కూడా క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు. అలాగే చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై కూడా నిఖీల్ చాలా నమ్మకంతో ఉన్నాడు. కార్తికేయ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంపై కూడా అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. మరి నిఖిల్ ఈ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

  English summary
  Nikhil Siddharth shocking comments on usa president,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X