twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంత ఖర్చను ఆయన అంగీకరించేవారా? హీరో నిఖిల్ ట్వీట్

    |

    'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' పేరుతో గుజరాత్ లోని నర్మదా నది తీరంలో 182 మీటర్ల ప్రపంచంలోని అత్యంత ఎత్తైన విగ్రహాన్ని బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించిన నేపథ్యంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    nikhil

    ఈ విగ్రహం కోసం రూ.2,989 కోట్లు వెచ్చించారు. ఈ నేపథ్యంలో తెలుగు హీరో నిఖిల్ ట్వీట్ చేశారు. 'మన దేశాన్ని ఏకం చేయడానికి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ చేసిన కృషిని గౌరవించాలి, గుర్తించాలి. ఏది ఏమైననప్పటికీ ఆయన జీవించి ఉంటే ఇంత వ్యయంతో తన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఒప్పుకునేవారో? లేదో? నాకైతే తెలియదు.' అంటూ వ్యాఖ్యానించారు.

    అయితే సిద్ధార్థ్ ట్వీట్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఆయన వ్యాఖ్యలను సమర్ధిస్తుండగా మరికొందరు మాత్రం... వ్యతిరేకించారు. అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నిర్మాణ సమయంలో నీలాంటి వారు ఇలాంటి కూతలే కూశారు. ఇపుడు అది అమెరికాకు ఒక ఐకాన్. పర్యాటక ప్రాంతం. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కూడా అలాంటి పర్యాటక ప్రాంతమే అవుతుందని కొందరు నిఖిల్ మీద విమర్శలు చేశారు.

    దీనికి నిఖిల్ స్పందిస్తూ... అలా జరుగాలని తాను కూడా కోరుకుంటున్నట్లు రిప్లై ఇచ్చారు. మరో ట్వీట్లో ఈ విగ్రహం వల్ల బాగా పర్యాటకులు వచ్చి మంచి ఆదాయం రావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

    English summary
    "For the Gigantic effort of uniting our Country, Sardar Vallabhbhai Patel deserves to be Recognised in the highest possible way🙏. However dont know if He was alive he would approve of the cost of making it 🤷‍♂️🤔" Nikhil Siddhartha tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X