నితిన్ కోసం రాసిన కథ.. ఇప్పుడు మరో హీరో చేతుల్లోకి..
యువ హీరో నితిన్ గత ఏడాది భీష్మ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు వరుస అపజయాలను చూసిన ఈ సీనియర్ హీరో మొత్తానికి భీష్మ ద్వారా కమర్షియల్ ఫార్మాట్ లోనే ట్రాక్ లోకి వచ్చాడు. అయితే ఆ సినిమా తరువాత మళ్ళీ ఎప్పటిలానే పరాజయాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. నితిన్ బాగానే కష్టపడినప్పటికి ఎందుకో వర్కౌట్ కావడం లేదు.
ఈ ఏడాది మొదట్లోనే బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చేసిన చెక్ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికి కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఆ తరువాత రిలీజ్ చేసిన రంగ్ దే కూడా నిరాశపరిచింది. దీంతో నితిన్ నెక్స్ట్ సినిమాలతో ఎలాగైనా సక్సెస్ అవ్వాలని చూస్తున్నాడు.

నెక్స్ట్ మాస్ట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందు ఓకే చేసిన పవర్ పేట అనే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ఛల్ మోహన్ రంగా దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట అనే సినిమా చేయడానికి ఒప్పుకున్న నితిన్ ఆ తరువాత ఎందుకో పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. ఇక ఆ దర్శకుడు శర్వానంద్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కథ చెప్పడంతో శర్వా పాజిటివ్ గా స్పందించినట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమా ఓకే అవుతుందో లేదో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











