కొత్త సినిమా కోసం నితిన్ సరికొత్త ప్రయోగం: ఇప్పటి వరకూ చేయని పాత్రలో

తెలుగులో జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో యూత్ స్టార్ నితిన్ ఒకడు. గత ఏడాది 'భీష్మ'తో భారీ విజయాన్ని అందుకున్న అతడు.. ఈ సంవత్సరం మాత్రం అప్పుడే రెండు పరాజయాలను (చెక్, రంగ్ దే) చవి చూశాడు. అయినప్పటికీ మరో సినిమా 'మాస్ట్రో'ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇది విడుదల కాకముందే నితిన్ మరో ప్రాజెక్టును లైన్‌లో పెట్టినట్లు కొద్ది రోజులుగా ఓ న్యూస్ ఫిలిం నగర్‌ ఏరియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఆసక్తికరమై వార్త బయటకొచ్చింది.

వరుస ఫ్లాపులతో సతమతం అవుతోన్న నితిన్.. ప్రముఖ రచయిత, 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'తో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇక, ఈ సినిమాలో నితిన్ పోలీస్ పాత్రను చేస్తున్నట్లు ఆ మధ్య ఓ న్యూస్ వైరల్ అయింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో అతడు రెండు విభిన్నమైన పాత్రలను చేస్తున్నాడు. అందులో ఒక దానికి విచిత్రమైన మేకోవర్‌తో కనిపించబోతున్నాడని తెలిసింది. అది గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

Nithiin To play never before Role in Vakkantham Vamsi Movie

ఇక, ఈ సినిమాను మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తాడట వక్కంతం వంశీ. దీని కోసం అదిరిపోయే స్క్రిప్టును రెడీ చేశాడని తెలిసింది. ఇక, దీని కోసం నితిన్ ఫిజిక్‌పై ఫోకస్ చేయనున్నాడని సమాచారం. ఇదిలా ఉండగా.. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ నటించిన 'మాస్ట్రో' ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక, ఈ సినిమా ఓటీటీలో నేరుగా విడుదల కాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ వివరాలతో పాటు వక్కంతం వంశీ ప్రాజెక్టును ఒకేరోజు ప్రకటించబోతున్నారనే టాక్ జోరగా వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X