twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Naatu Naatu for Oscars 2023.. ఆస్కార్ సాధించాలి.. చిరంజీవి, పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?

    |

    ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ జగత్తు బాక్సాఫీస్ రికార్డులను తిరుగరాసిన RRR చిత్రం భారతీయ సినిమా పరిశ్రమ జెండాను మరోసారి అంతర్జాతీయ వేదికలపై రెపరెపలాడించింది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన RRR చిత్రం ఇప్పటికే పలు అవార్డులను అంతర్జాతీయస్థాయిలో అందుకొన్నది. తాజాగా 2023 ఆస్కార్ అవార్డుల కోసం జరిగిన నామినేషన్లలో నాటు నాటు పాట అర్హత సాధించింది. ఈ ఘనతను సాధించిన RRR టీమ్‌పై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం గుప్పిస్తున్నారు. ఈ సందర్బంగా చిరంజీవి, పవన్ కల్యాణ్ స్పందిస్తూ..

    నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడంపై మెగాస్టార్ చిరంజీవి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పాటను రాసిన చంద్రబోస్, పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, పాటకు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, ఈ పాటలో నటించిన తారక్, రాంచరణ్, అలాగే సినిమాను నిర్మించిన డీవీవీ మూవీస్‌కు బిలియన్ విషెసె. 2023, మార్చి 12వ తేదీన జరగబోయే అవార్డుల ప్రకటనలో విజయం సాధించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    Pawan Kalyan and Chiranjeevi reaction on RRRs Naatu Naatu Song nominated for Oscar 2023

    RRR చిత్రంలోని నాటు.. నాటు... గీతం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ పురస్కారానికి నామినేట్ కావడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. మన తెలుగు పాట ఆస్కార్ కోసం తుది బరిలో పోటీపడటం అందరికీ గర్వ కారణం. ఇంతటి ప్రాచుర్యం పొందేలా గీతాన్ని స్వరపరచిన శ్రీ ఎమ్ఎమ్ కీరవాణి గారికి హృదయపూర్వక అభినందనలు. నాటు.. నాటు... గీతం ఆస్కార్ అవార్డు దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఆస్కార్ బరిలో మన చిత్రం నిలిచేలా చేసిన దర్శకుడు శ్రీ రాజమౌళి, హీరోలు శ్రీ రాం చరణ్, శ్రీ ఎన్టీఆర్, నిర్మాత శ్రీ డి.వి.వి.దానయ్య, గీత రచయిత శ్రీ చంద్రబోస్, గాయకులు శ్రీ రాహుల్ సిప్లిగంజ్, శ్రీ కాలభైరవ, ఇతర సాంకేతిక బృందానికి అభినందనలు అని పవన్ కల్యాణ్ తెలిపారు.

    English summary
    Pawan Kalyan and Chiranjeevi reaction on RRR's Naatu Naatu Song nominated for Oscar 2023
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X