మనిషి కాదు రాక్షసుడు.. నా బిడ్డల్ని కడుపులోనే చంపేసి.. స్టార్ హీరోపై భార్య షాకింగ్ కామెంట్స్
సినిమాలలో హీరోగా నటిస్తూ కోట్లాది మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు నటీనటులు. అయితే సినిమాలలో వారి ప్రవర్తనకు, వ్యక్తిగత జీవితంలోని బిహేవియర్‌కు ఏ మాత్రం సంబంధం ఉండదు. సినిమాలలో మంచి మనిషిగా, మానవతావాదిగా కనిపించే హీరోల నిజ స్వరూపాలు వేరుగా ఉంటాయి. డ్రగ్స్ కేసులు, హత్యలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు వివిధ నేరాలలో అభియోగాలు ఎదుర్కోవడంతో పాటు జైలుకు వెళ్లినవారు కూడా ఉన్నారు. సినిమాలలో భార్యను కళ్లలో పెట్టుకుని చూసుకునే వారు .. రియల్ లైఫ్‌లో వారిని వేధిస్తూ నరకం చూపిస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోపై సొంత భార్యే సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
నటి నడుము గిల్లిన పవన్ సింగ్
భోజ్‌పురిలో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నారు పవన్ సింగ్. సింగర్‌గా కెరీర్ మొదలుపెట్టి.. నేడు భోజ్‌పురి ఇండస్ట్రీకి ఐకాన్‌గా ఎదిగారు పవన్. సినిమాలతో పాటు వివాదాల్లోనూ పవన్ సింగ్‌కి ఎంతో చరిత్ర ఉంది. కొద్దిరోజుల క్రితం లక్నోలో సైయా సేవా కరే పాట ప్రమోషన్ కోసం జరిగిన ఓ కార్యక్రమంలో సినీనటి, సింగర్ అంజలి రాఘవ్‌తో పవన్ సింగ్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె స్టేజ్ మీద మాట్లాడుతుండగా ఆయన అంజలి నడుమును పదే పదే తాకాడు. ఏం చేయాలో తెలియక అంజలి నవ్వుతూ కవర్ చేసుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. పవన్ సింగ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

ఆ ఇండస్ట్రీలో నటించను
ఈ వివాదంపై అంజలి రాఘవ్ ఘాటుగా స్పందించారు. పవన్ సింగ్ తీరుతో నాలో నేను కుమలిపోయా.. ఎంతో ఏడ్చానని ఓ వీడియో విడుదల చేశారు. మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకకూడదని, అందుకే ఇకపై భోజ్‌పురి చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటానని అంజలి రాఘవ్ స్పష్టం చేశారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో అంజలికి పవన్ సింగ్ క్షమాపణలు చెప్పారు. ఈ వివాదం మధ్యలోనే పవన్ సింగ్ భార్య జ్యోతి సింగ్ తన భర్త గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తొలుత పవన్ సింగ్‌కు నీలం సింగ్ అనే యువతితో పెళ్లయ్యింది. ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించగా, ఆ తర్వాత జ్యోతి సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు పవన్.
నాకు చావే దిక్కు
పవన్ సింగ్ తనను పట్టించుకోవడం లేదని.. ఏడేళ్లుగా నీతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నానని జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. నేనేం తప్పు చేశానని ఇలా శిక్షిస్తున్నావ్.. లోక్‌సభ ఎన్నికల సమయంలో నాలో లేనిపోని ఆశలు కల్పించావని ఆమె నిలదీశారు. చివరిసారిగా అడుగుతున్నా లేదంటే సజీవదహనం చేసుకుని చనిపోతానని జ్యోతి సింగ్ వార్నింగ్ ఇచ్చారు. వరుస వివాదాలతో పవన్ సింగ్ వ్యవహారం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
బలవంతంగా అబార్షన్ టాబ్లెట్స్
తాజాగా జ్యోతి సింగ్ మరో బాంబు పేల్చారు. ఇటీవల ఓ సమావేశంలో జ్యోతి మాట్లాడుతూ.. నేను తల్లిని కావడం పవన్‌కు ఇష్టం లేదని, నేను గర్భం దాల్చినప్పుడల్లా బలవంతంగా అబార్షన్ టాబ్లెట్స్ ఇచ్చేవాడని జ్యోతి సంచలన వ్యాఖ్యలు చేసింది. అతనికి వ్యతిరేకంగా మాట్లాడితే నరకం చూపించేవాడని, దాంతో చనిపోవాలని అనుకున్నానని ఇటీవల 25 నిద్రమాత్రలు మింగడంతో రణు, దీపక్ భయ్యా, విక్కీ జీలు నన్ను ముంబైలోని బెల్లేవ్ ఆసుపత్రిలో చికిత్స అందించారని జ్యోతి సింగ్ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే జ్యోతి ఆరోపణలను పవన్ ఖండించారు. తన భార్య చేసిన ఆరోపణలు అవాస్తవాలని.. అందరికీ ఆడవాళ్ల బాధే కనిపిస్తుందని, కానీ ఎవరూ మగాడి బాధను పట్టించుకోరని వాపోయాడు. ప్రస్తుతం జ్యోతి సింగ్ వ్యాఖ్యలు భోజ్‌పురి పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











