Prabhas: 7 సినిమాలు లైన్లో పెట్టిన ప్రభాస్.. డార్లింగ్ ఫ్లాన్ మామూలుగా లేదుగా...
ప్రస్తుతం ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై బిగ్గెస్ట్ స్టార్ ఎవరు? అని అడిగితే వెంటనే వచ్చే సమాధానం ప్రభాస్.. 'బాహుబలి' సిరీస్ తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్, ఇప్పుడు ఇండియన్ సినిమాకు కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్ సినిమాలు, పాన్-ఇండియా రిలీజ్‌లు, హాలీవుడ్ స్థాయిలో మేకింగ్ తో మోస్ట్ అవైటేడ్ స్టార్ గా నిలిచారు. అయితే, డార్లింగ్ కు ఉన్న వర్క్ లైన్‌ప్ చూసినంత మాత్రాన ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 7 సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు మరో రెండు మూడు ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయని టాలీవుడ్ టాక్. ఈ సినిమాలన్నీ భారీ స్థాయిలో తెరకెక్కుతుండగా, షూటింగ్స్ ఎలా మేనేజ్ చేస్తున్నాడా అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ మొదలైంది.
"ది రాజాసాబ్" - హారర్ కామెడీ అవతారంలో ప్రభాస్
మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో ఓ కొత్త మలుపు కానుంది. భారీ యాక్షన్ రోల్స్‌లో కనిపించే ప్రభాస్, ఈసారి హారర్ కామెడీ టచ్‌తో ఎంటర్టైన్ చేయబోతున్నాడు."ది రాజాసాబ్" చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2026 జనవరిలో విడుదల చేయనున్నారు. సినిమా షూటింగ్ తుది దశలో ఉండగా, ప్రమోషన్లు ముందుగానే ప్రారంభించారు. 100 రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేయడం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఫౌజీ
'సీతా రామం'తో క్లాస్ టచ్ ఇచ్చిన దర్శకుడు హను రాఘవపూడి, ఈసారి ప్రభాస్‌తో కలిసి పీరియాడికల్ వార్ డ్రామా తీస్తున్నారు.1940ల భారతదేశం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద కీలక పాత్రలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సుమారు రూ.600 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 2026లో విడుదల కానుంది. ఇప్పటికే 50% షూటింగ్ పూర్తయిందని సమాచారం.
"స్పిరిట్"
'అర్జున్ రెడ్డి', 'యానిమల్' లాంటి క్రేజీ సినిమాలు చేసిన సందీప్ వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న సినిమా స్పిరిట్. ఇది పాన్-ఇండియా మాత్రమే కాదు, పాన్-వరల్డ్ యాక్షన్ మూవీగా తెరకెక్కనుంది. నవంబర్‌లో షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రి ఎంపిక అయ్యింది. ఈ సినిమాలో ఒక కొత్త ప్రభాస్‌ని చూపించబోతున్నామని దర్శకుడు చెప్పాడు. విడుదల 2026లో ఉండొచ్చని అంచనా.
"కల్కి 2898 ఏడీ పార్ట్ 2"
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ ప్రభాస్ కెరీర్‌లో మరో భారీ విజయంగా నిలిచింది. ఇప్పుడు దాని సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీపికా పదుకొణె తప్పుకోవడంతో కొత్త హీరోయిన్ ఎంపికలో టీమ్ బిజీగా ఉంది. స్క్రిప్ట్ ఇప్పటికే రెడీ కాగా, షూటింగ్ త్వరలో మొదలయ్యే అవకాశం ఉంది. మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, విజయ్ దేవరకొండ లాంటి గెస్ట్ రోల్స్‌తో సినిమాపై హైప్ మరింత పెరిగింది.
"సలార్ పార్ట్ 2"
కెజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన 'సలార్'ప్రభాస్‌కు మాస్ మార్కెట్‌లో పెద్ద బూస్ట్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో "డ్రాగన్" చేస్తున్నారు. అది పూర్తైన వెంటనే సలార్ పార్ట్ 2 ప్రారంభం కానుంది. ఇది యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో సరికొత్త ట్రీట్మెంట్‌తో ఉండబోతుందని సమాచారం.
"మైత్రీ మూవీ మేకర్స్" తో కొత్త సినిమా తాజాగా ప్రభాస్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో మరో ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. దర్శకుడి పేరు ఇంకా ప్రకటించలేదు కానీ, ఇది కామర్షియల్ యాక్షన్ డ్రామాగా ఉండనుంది. ఈ సినిమా కూడా రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారు. ఇవే కాకుండా..'లియో', 'విక్రమ్' లాంటి హిట్స్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్‌తో కూడా ప్రభాస్ సినిమా చర్చల్లో ఉంది. అదే విధంగా, 'హనుమాన్' దర్శకుడు ప్రశాంత్ వర్మతో కూడా ఒక పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ఫైనలైయ్యే దశలో ఉందని టాక్.
ఈ రెండు సినిమాలు కన్ఫర్మ్ అయితే, ప్రభాస్ లైన్‌ప్ 2030 వరకు పూర్తవుతుందని చెప్పొచ్చు. అయితే.. ఇన్ని సినిమాలు చేస్తున్నప్పటికీ ప్రభాస్ తన టైమ్ మేనేజ్‌మెంట్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. రోజుకు 14 గంటల వరకు షూటింగ్ చేస్తూ, ఒకేసారి రెండు సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రొఫెషనల్‌గా ఎంత డెడికేటెడ్‌గా ఉంటాడో, అతని నిర్మాతలు కూడా తరచూ చెబుతుంటారు.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల బడ్జెట్‌లను కలిపి చూస్తే దాదాపు ₹3500 కోట్లకు పైగా అవుతోంది. ఇంత భారీ లైన్‌ప్‌తో ఉన్న హీరో భారతీయ సినీ చరిత్రలో ఇదే మొదటిసారి. ప్రభాస్ సినిమాలన్నీ పాన్-ఇండియా మాత్రమే కాదు, పాన్-వరల్డ్ మార్కెట్‌కి చేరేలా ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత కూడా ప్రభాస్ క్రేజ్ తగ్గలేదు.అది మరింత పెరిగింది. ప్రభాస్‌ను ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌లో "మోస్ట్ బిజీయెస్ట్ స్టార్"గా నిలబెట్టాయి.


Click it and Unblock the Notifications











