For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Kareena Kapoor ఇంటికి బిర్యానీ పంపిన ప్రభాస్ .. ఫిదా అయ్యి ఆసక్తికర కామెంట్స్ చేసిన కరీనా!

  |

  బాలీవుడ్ నటి కరీనా కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ప్రతిరోజూ తన అభిమానులతో ఆసక్తికరమైన పోస్ట్‌లను పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల, ఆమె అలాంటి ఒక పోస్ట్ చేసి ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. విషయం ఏంటంటే తన భర్త సైఫ్ అలీ ఖాన్ తో పాటు కలిసి నటిస్తున్న ప్రభాస్ తన ఇంటికి రుచికరమైన బిర్యానీని పంపినట్లు ఆమె పేర్కొంది. ఈ బిర్యానీ ఫోటోను షేర్ చేస్తూ, కరీనా ఒక ఫన్నీ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఆమె ఏమన్నదో తెలుసుకుందామా ?

   కరీనాకు ప్రభాస్ బిర్యానీ

  కరీనాకు ప్రభాస్ బిర్యానీ

  యంగ్ రెబల్ స్టార్ సూపర్ స్టార్ ప్రభాస్ త్వరలో సైఫ్ అలీ ఖాన్ తో కలిసి ఆదిపురుష్ అనే ఒక మైథలాజికల్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తూ ఉండగా సైఫ్ అలీ ఖాన్ రావణుడు పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల సైఫ్ మరియు అతని కుటుంబానికి ప్రభాస్ డిన్నర్ పంపిన అంశం సంచలనంగా మారింది. ప్రభాస్ తన ఇంటి నుంచి పంపిన విందు ఫోటోలను, బిర్యానీ ఫోటోలను కరీనా కపూర్ షేర్ చేశారు.

  థ్యాంక్యూ ప్రభాస్‌

  థ్యాంక్యూ ప్రభాస్‌

  ప్రభాస్ రైఫ్, సలాడ్ మరియు ఇతర ఆహార పదార్థాలతో పాటు బిర్యానీని సైఫ్ ఇంటికి పంపించాడు. తన ఇన్‌స్టాగ్రామ్ కథలో ప్రభాస్ బిర్యానీ ఫోటోలు పంచుకుంటూ, కరీనా కపూర్ ప్రభాస్‌ చూపించిన అభిమానం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. 'బాహుబలే బిర్యానీ పంపిస్తే.. అది ది బెస్ట్‌ ఫుడ్ అనే చెప్పాలి, రుచికరమైన భోజనాన్ని పంపించినందుకు థ్యాంక్యూ ప్రభాస్‌' అని కరీనా తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

   కరీనా ఫ్యామిలీ వంతు

  కరీనా ఫ్యామిలీ వంతు

  సాధారణంగా ప్రభాస్‌ భోజన ప్రియుడనే విషయం అందరికీ తెలిసిందే. తనతో వర్క్‌ చేసే కోస్టార్స్‌కి ఆయన వివిధ రకాలైన వంటకాలను రుచి చూపిస్తుంటారు. గతంలో శ్రద్దా కపూర్, శృతీ హాసన్ ఈ మధ్య కాలంలో నటి భాగ్యశ్రీకి సైతం ప్రభాస్‌ పూతరేకులు గిఫ్ట్‌గా పంపించారు.వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు కరీనా ఫ్యామిలీ వంతు వచ్చింది.

  రామాయణ ఇతిహసంతో

  రామాయణ ఇతిహసంతో

  ఇక ప్రభాస్ నటిస్తున్న 'ఆదిపురుష్‌' విషయానికి వస్తే.. బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో.. సైఫ్‌ రావణుడి పాత్రలో సందడి చేయనున్నారు. ప్రభాస్‌కు జోడీగా సీత పాత్రలో నటి కృతిసనన్‌ కనిపించనున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమా టీసిరీస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోంది.

  వరుస సినిమాలతో బిజీ

  వరుస సినిమాలతో బిజీ

  ఓం రౌత్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో హిందీ మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలలో విడుదల అవుతుంది. ఇక ఈ సినిమా కాకుండా ప్రభాస్ తన రొమాంటిక్ డ్రామా చిత్రం 'రాధే శ్యామ్' విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. గత కొద్దీ రోజులుగా ముంబైలో ఆది పురుష షూటింగ్ లో పాల్గొంటున్న ప్రభాస్ వీలైనంత త్వరగా ఈ సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు.

  Recommended Video

  Prabhas Launched Kalakhar Teaser కళాకార్ టీజర్ లాంచ్ | Rohith
  కరీనా సినిమాల విషయానికి వస్తే

  కరీనా సినిమాల విషయానికి వస్తే

  శ్రద్ధా కపూర్ మరియు జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ల సరసన సాహోలో కనిపించిన తరువాత, అతను ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లు అయిన కృతి సనన్ మరియు దీపికా పదుకొనేతో సినిమాలు చేస్తున్నాడు. ఇక మరోవైపు, కరీనా సినిమాల గురించి చెప్పాలంటే ఆమె చిత్రం లాల్ సింగ్ చద్దా ఈ సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా దానిని వాలెంటైన్స్ డేకు వాయిదా వేశారు. ఈ సినిమాతో కరీనా రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రం హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ కి హిందీ రీమేక్. ఈ సినిమాలో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్నారు.

  English summary
  Prabhas Sends Biryani Dinner To Saif Ali Khan And Family recently kareena kapoor Shares The Picture.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X