అనుష్క శెట్టి కోసం ప్రభాస్.. స్వీటీ కోసం ప్రేమగా.. నేను ఊరుకోను అంటూ

టాలీవుడ్ క్వీన్ స్వీటీ అనుష్క శెట్టి నటించిన ఘాటి చిత్రం అన్ని హంగులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైంది. సెన్సిబుల్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఫీల్ గుడ్ అంచనాలను పెంచేసింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో అనుష్క భాగం కానప్పటికీ.. ఆమె అభిమానులు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ప్రభాస్ రంగంలోకి దిగాడు. అనుష్క కోసం ప్రేమగా ఏం చేస్తున్నాడనే వివరాల్లోకి వెళితే..

మిర్చి, బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా ప్రేక్షకులే కాకుండా దేశవ్యాప్తంగా వారికి అభిమానులు కోట్లాదిగా ఏర్పడ్డారు. వారిద్దరి మధ్య ఉండే స్నేహం, ఫ్రెండ్‌షిప్‌కు మించిన రిలేషన్‌షిప్‌పై అందరూ ఆసక్తిగా ఉన్నారు. వారిద్దరి మధ్య ఓ ప్రత్యేక బంధంపై అనేక ఊహాగానాలు, రూమర్లు, గాసిప్స్ భారీగానే వచ్చాయి. కానీ ఆ ఇద్దరు స్టార్స్ మాత్రం ఎవరేమని అనుకొన్నా.. తమ దారిలో తాము ముందుకెళ్లారు.

Prabhas Unveils Anushka Shetty s Ghaati Release Glimpse

అయితే ఇలాంటి రూమర్లను పట్టించుకోకుండా తనకు ఇష్టమైన అనుష్కశెట్టి, బ్యానర్ కోసం ప్రభాస్ ముందుకు రావడంపై ఆయన అభిమానులు, స్వీటీ ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ మళ్లీ ఎప్పుడు కలిసి నటిస్తారనే చర్చ సోషల్ మీడియాలో కనిపిస్తున్నది. ఆ రోజు త్వరలోనే ఉంటుందని ఇటీవల అనుష్క కూడా కన్ఫర్మ్ చేయడం తెలిసిందే.

గంజాయి మాఫియాను ఎదురించిన శీలావతి అనే పాత్రతో అనుష్క శెట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ అందర్నీ ఆకట్టుకోవడంతో సానుకూలమైన వాతావరణం బాక్సాఫీస్ వద్ద కనిపిస్తున్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ క్రమంగా పుంజుకొంటున్నది. ఈ మూవీ వసూళ్లు పూర్తిగా కరెంట్ బుకింగ్‌పైనే ఉండే అవకాశాలు స్పష్టం కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాను మరింత చేరువ చేయడానికి చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

ఘాటీ చిత్రం ద్వారా క్వీన్ అనుష్క ఆగమనాన్ని స్వాగతించే విధంగా రిలీజ్ గ్లింప్స్ పేరుతో ఈ ప్రోమోను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమా గ్లింప్స్‌ను ప్రభాస్ చేతులు మీదుగా ఆవిష్కరింపజేసి..ఈ సినిమాపై బజ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ప్రభాస్ ద్వారా రిలీజ్ గ్లింప్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ఇదిలా ఉండగా, ప్రభాస్ రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో అనుష్క వీరోచిత విన్యాసాలు.. యాక్షన్ సీక్వెన్స్.. గూస్ బంప్స్ కలిగించే సన్నివేశాలు ఉన్నాయి. అయితే వాళ్లు ఊరుకోరు.. వీళ్లు ఊరుకోరు అంటే.. నేను ఊరుకోను అని అనుష్క చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకొన్నది. ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేలా చేశాయి.

More from Filmibeat

Read more about: prabhas anushka shetty ghaati
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X