twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR రామ్ చరణ్ పెద్ద మనసు.. ఉక్రెయిన్‌లో వ్యక్తికి డబ్బు ట్రాన్స్‌ఫర్.. ఎందుకంటే?

    |

    ప్రస్తుతం ఉక్రెయిన్ లో పరిస్థితులు ఏ మాత్రం బాలేదు. రష్యా ఉక్రెయిన్ మీద దండెత్తడం తో పాటు కొన్ని రోజుల నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే తాజాగా అక్కడ తమ షూటింగ్ కి సంబంధించిన విశేషాలను రౌద్రం రణం రుధిరం -RRR సినిమా యూనిట్ పంచుకుంది. రామ్ చరణ్ అయితే ఆ సినిమా షూటింగ్ చేసేటప్పుడు తనకు సెక్యూరిటీగా పనిచేసిన వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలిసి కొంత డబ్బులు కూడా అకౌంట్లో వేశానని చెప్పుకొచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే

    అడుగుపెట్టలేని పరిస్థితి

    అడుగుపెట్టలేని పరిస్థితి

    మీరు గమనించినట్లయితే రౌద్రం రణం రుధిరం -RRRలో సూపర్ హిట్ గా నిలిచిన నాటు నాటు అనే సాంగ్ షూటింగ్ ఉక్రెయిన్ లోనే జరిపారు. ఆ పాటలు బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్స్ గా కనిపించిన వారందరూ కూడా ఉక్రెయిన్ వాసులే. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఆ దేశంలో జరిపినప్పుడు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు కానీ ఇప్పుడు మాత్రం బయట అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది.

    ఇదే ప్రశ్న

    ఇదే ప్రశ్న

    ఇంటికి ఒక పౌరుడు బయటకు వచ్చి యుద్ధంలో పాల్గొనాలని ఆ దేశ అధ్యక్షుడు పిలుపునివ్వడంతో వయసుతో సంబంధం లేకుండా ఎవరో ఒకరు వెళ్లి యుద్ధంలో పాల్గొని ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. తాజాగా సినిమా ప్రమోషన్స్ కోసం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం తో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు కూడా ఇదే ప్రశ్న తలెత్తింది.

    షూటింగ్ జరుపుతున్న సమయంలో

    షూటింగ్ జరుపుతున్న సమయంలో

    మీరు అక్కడ షూటింగ్ జరుపుతున్న సమయంలో ఇలాంటి పరిస్థితి ఏదైనా జరుగుతుంది అని మీరు ఊహించారా? అసలు యుద్ధం మొదలైన తర్వాత అక్కడి వారితో కాంటాక్ట్ లో ఉన్నారా అనే ప్రశ్నలు సంధించగా దానికి జక్కన్న సహా ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా స్పందించారు.

    నేర్చుకోవాలనే క్యూరియాసిటీ

    నేర్చుకోవాలనే క్యూరియాసిటీ

    ఉక్రెయిన్‌లో ప్రజలకు, ముఖ్యంగా డ్యాన్సర్లకు కొత్త విషయం తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంది అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. "ఉక్రెయిన్ ప్రజలు చాలా ఫ్రెండ్లీ. ప్రొఫెషనల్. అక్కడ డ్యాన్సర్ల గురించి చెప్పాలని అంటూ 'నాటు నాటు...' సాంగ్ చూశారు కదా! వాళ్ళు ఎంత బాగా చేశారో... సాంగ్‌లో డ్యాన్స్ స్టైల్ వాళ్ళ డ్యాన్స్ స్టైల్ కాదు. కానీ, వాళ్ళు చాలా ఫాస్ట్‌గా నేర్చుకున్నారని అన్నారు. వాళ్ళకు కొత్తది నేర్చుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది" అని ఎన్టీఆర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

    డబ్బు పంపిన రామ్ చరణ్

    డబ్బు పంపిన రామ్ చరణ్

    ఇక ఉక్రెయిన్‌లో తనకు తెలిసిన వ్యక్తులకు ఆర్థిక సహాయం చేశానని రామ్ చరణ్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ "మేం 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ చేసేటప్పుడు ఉక్రెయిన్‌లో ఆందోళన వాతావరణం ఏమీ ఫీలవ్వలేదు. యుద్ధం మొదలైన తర్వాత 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ టైమ్‌లో... అక్కడ నాకు సెక్యూటిరీగా ఉన్న వ్యక్తితో మాట్లాడాను. ఆయన తండ్రి, 80 ఏళ్ల వ్యక్తి గన్ పట్టుకుని యుద్ధంలో పాల్గొంటున్నారు. ఏం సహాయం చేయగలమో తెలియక ఆయన ఖాతాకు కొంత డబ్బులు పంపించాను. ఆ సహాయం సరిపోదు. అయినా సరే నా వంతు సహాయం నేను చేశా" అని రామ్ చరణ్ చెప్పుకోచ్చారు.

    English summary
    Ram charan helped his Ukraine security guard financially during the war crisis.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X