Mega Vs Nandamuri Fan War ఫ్యాన్స్ గొడవలతో విసిగిపోయాం.. ఎన్టీఆర్, రాంచరణ్ రియాక్షన్

సినిమా పరిశ్రమలో ఇద్దరు టాప్ హీరోల మధ్య ఫ్యాన్ వార్ అనేది సాధారణమే. తమిళంలో అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య ట్రోల్ వార్ పీక్స్‌గా కనిపిస్తుంటుంది. అలాగే తెలుగు విషయానికి వస్తే.. మెగా, నందమూరి అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ ఓ రేంజ్‌లో ఉంటుంది. దశాబ్దాల కాలంగా ఇద్దరు హీరోల అభిమానులు రచ్చ మూములుగా ఉండదు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల విషయంలో ఈ ఫ్యాన్ వార్ భారీగానే కనిపించింది. అయితే ఈ ఫ్యాన్ వార్‌పై రాంచరణ్, ఎన్టీఆర్ స్పందిస్తూ..

అభిమానుల మధ్య వైరంపై

అభిమానుల మధ్య వైరంపై

నందమూరి, మెగా అభిమానుల మధ్య ఉన్న వైరానికి అడ్డుకట్ట వేయడానికి రెండు ఫ్యామిలీ హీరోలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆయ కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పలు సందర్భాల్లో తెలియజెప్పేందుకు ప్రయత్నించారు. ఇటీవల రాంచరణ్, ఎన్టీఆర్ కలిసి RRR లో నటించి.. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.

మా మధ్య వైరం లేదు

మా మధ్య వైరం లేదు

ప్రస్తుతం RRR సినిమా ఆస్కార్ బరిలో ఉన్నందున రాంచరణ్, ఎన్టీఆర్ అమెరికాలో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా గ్లోల్డెన్ గ్లోబల్ అవార్డు అందుకొన్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి వారసుడిగా చరణ్, ఎన్టీఆర్ వారసత్వంతో వచ్చిన తారక్ తమ ఫ్యాన్స్ మధ్య ఉన్న అభిప్రాయ బేధాలు, వైరం గురించి వివరణ ఇచ్చారు. మేము ఎప్పుడూ ఫ్రెండ్స్‌లానే ఉంటాం. మా మధ్య అలాంటి వైరం లేదు అని అన్నారు.

విభేదాలు మా మధ్య లేదు అంటూ

విభేదాలు మా మధ్య లేదు అంటూ

అయితే అభిమానుల మధ్య ఉన్న వైరమే మా ఇద్దరిని స్నేహితులుగా చేసింది. ఫ్యాన్ వార్, ఫ్యాన్స్ మధ్య గొడవల విషయంలో మేము చాలా విసిగిపోయాం. అందుకే అలాంటి విభేదాలు ఫ్యాన్స్ మధ్య ఉండకూడదని మేము కలిసి నటిస్తున్నాం. కలిసి ఉన్నామనే సందేశాన్ని అభిమానులుకు పంపుతున్నాం అని రాంచరణ్ అన్నాడు.

మా వంతు ప్రయత్నం చేస్తున్నాం

మా వంతు ప్రయత్నం చేస్తున్నాం

మా అభిమానుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఆన్ స్క్రీన్ కానీ, ఆఫ్ స్క్రీన్ కానీ మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. భిన్న ధ్రువాలు ఆకర్షించుకొంటాయన్నంటూ.. మేమిద్దరం చాలా సంతోషంగా కలిసిపోయాం. అందుకే మేము ఎక్కువగా కలిసి ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఒకరిపై మరొకరం ప్రేమను, అభిమానాన్ని చూపించుకొంటాం అని ఎన్టీఆర్ అన్నాడు.

ఆస్కార్ కోసం RRR

ఆస్కార్ కోసం RRR

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్వకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ నటించిన RRR చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లనే కాకుండా అవార్డులను కూడా గెలుచుకొంటున్నది. ఇటీవల క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డులను అందుకొన్నది. త్వరలో జరిగే ఆస్కార్ అవార్డుల ప్రధానంలో వివిధ క్యాటగిరీలో అవార్డును అందుకొనేందుకు రెడీ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X