twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లాక్ డౌన్ టెన్షన్.. హైదరాబాద్ బయలుదేరిన రామ్ చరణ్ !

    |

    భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కర్ణాటక ప్రభుత్వం రేపటి నుంచి పదిహేను రోజులు లాక్ డౌన్ విధించింది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం రెస్ట్ తీసుకుందామని బెంగళూరు ఫామ్ హౌస్ కి వెళ్ళిన రామ్ చరణ్ ఇప్పుడు హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరినట్లు తెలుస్తోంది. నిజానికి ఆయన ఐసోలేషన్ కి వెళ్లాల్సి వుండడంతో నేరుగా హైదరాబాద్ నుంచి బెంగళూరు ఫాం హౌస్ కి వెళ్ళారు. కొద్ది రోజుల క్రితం సోనూసూద్ సహా ఆచార్య యూనిట్ లో మరి కొందరికి కరోనా సోకడం, రామ్ చరణ్ వ్యానిటీ వ్యాన్ డ్రైవర్ కూడా కరోనా కారణంగా మరణించిన సంగతి తెలిసిందే.

    గ్లామర్‌తో అదరగొట్టిన రత్తాలు.. ఈ సమయంలో అక్కడ రాయ్ లక్ష్మి జిగేల్

    ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. హైదరాబాదు కంటే బెంగళూరు ఫాంహౌస్లో కాస్త రిలాక్స్ అవచ్చనే భావనతో ఆయన అక్కడకి వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ ఈరోజు సాయంత్రం అక్కడి ప్రభుత్వం 15 రోజులు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఆయన ఈ రోజు అక్కడి నుంచి హైదరాబాదు బయలుదేరినట్లు సమాచారం. రామ్ చరణ్ కి గత ఏడాది కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే కొద్ది రోజులకే ఆయన కరోన నుంచి కోలుకున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ ఆచార్య సినిమాతో పాటు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు.

    Ram Charan returns to Hyderabad from Bengaluru farmhouse

    ఆచార్య సినిమాలో చిరంజీవి హీరోగా నటిస్తుండగా ఆయనకు శిష్యుడి పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. రామ్ చరణ్ పాత్ర పేరు సిద్ధ అంటూ కొద్ది రోజుల క్రితం యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక మరో పక్క రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాల మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే రెండు సినిమాలు చెప్పిన డేట్ కి విడుదల అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కరోనా కారణంగా రెండు సినిమాలు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.

    English summary
    Ram Charan recently went to Bengaluru to stay some time at his farmhouse as part of his isolation. Becasuse recently, several cast and crew members of ‘Acharya’ had contracted COVID-19. But the Karnataka government has announced a two-week lockdown from tomorrow in the state. So Sources say that he will be returning to Hyderabad today.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X