‘చూడటానికి చాక్లెట్ బాయ్.. చేసేవి ఆ పనులా?’రామ్ పోతినేని నిజస్వరూపాన్ని బయటపెట్టిన జగపతిబాబు

తెలుగు ప్రేక్షకులకు హీరో రామ్ పోతినేని( Ram Pothineni)గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు రామ్ పోతినేని. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే.. ఇటీవల రామ్ నటించిన 'స్కంద','ది వారియర్'వంటి డిజాస్టర్ గా మారాయి. దీంతో రామ్ ఈసారి ఎలాగైనా 'ఆంధ్రా కింగ్ తాలూకా'మూవీతో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. మహేశ్ బాబు. పి దర్శకత్వం వహిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని మూవీ ఈ మూవీ నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రామ్ ఒక ఆసక్తికర విషయంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఇంతకీ ఆ విషయమేంటీ?

ప్రముఖ నటులు జగపతి బాబు(Jagapathi Babu) 'జయమ్ము నిశ్చయమ్మురా'(Jayammu Nischayammu Raa)షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో కి ఇప్పటివరకు చాలామంది గెస్టులు హాజరయ్యారు. తాజాగా రామ్ పోతినేని కూడా ఈ షో కి గెస్ట్ గా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఒక ప్రోమో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ టాక్ షోలోకి రామ్ వచ్చి కూర్చోగానే జగపతిబాబు సీరియస్ టోన్‌లో మాట్లాడుతూ "ఐ వాస్ థింకింగ్... రామ్ పోతినేని అంటే ఓ అర్గేంట్ పర్సన్, యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి అనుకున్నా" అని షాకింగ్ కామెంట్ చేశారు. దీనికి రామ్ ఆశ్చర్యంగా స్పందిస్తూ 'నా గురించి తెలిసి మాట్లాడుతున్నారా? తెలియక మాట్లాడుతున్నారా? " అని ప్రశ్నించడంతో అక్కడ వాతావరణం మరింత ఆసక్తికరంగా మారింది.

Ram Pothineni s Honest Answers Surprise Jagapathi Babu in Jayammu Nischayammu Raa

జగపతిబాబు వెంటనే చమత్కారంగా "నేను మాత్రం నిన్ను చాలా మంచోడు అని విన్నాను" అని అన్నారు. అందుకు రామ్ సీరియస్ గా స్పందిస్తూ "ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు... ఒకరు కలుపుకునేవారు, మరొకరు విడదీసేవారు" అని సమాధానమిచ్చాడు. ఆ వెంటనే జగ్గుభాయ్ "నీ లైఫ్‌ను గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నావా?" అని అడగగా, రామ్ "నన్ను గురించి ఎవరు ఏమనుకుంటారో అనే భయం కంటే.. నేనే ఏమనుకుంటున్నానో అనే భయం ఎక్కువ" అంటూ లోతైన సమాధానం ఇచ్చాడు. ఈ జవాబు వినగానే జగపతిబాబు నవ్వులు పూయించి, "ఇంత సీరియస్‌గా ఉండొద్దు బాస్!" అంటూ వాతావరణాన్ని కూల్ చేశారు.

తర్వాత జగ్గుభాయ్ సరదాగా మాట్లాడుతూ "చూడటానికి చాక్లెట్ బాయ్‌లా ఉంటావ్ కానీ చేసేవి చాలా స్మార్ట్ పనులంట!" అని అంటారు. ఆపై రామ్ గతంలో ఒక కథలో బాగా ఇన్వాల్వ్ అయ్యాడని ప్రస్తావించారు. రామ్ నవ్వుతూ "అప్పుడు చరణ్ ఇంకా ఇంట్రడ్యూస్ కాలేదు... చిరంజీవిగారు, చరణ్ గారు అక్కడ కూర్చుని ఉన్నారు... నేను మాత్రం సీన్స్‌లో పూర్తిగా ఎంజాయ్ అవుతున్నా!" అని చెప్పాడు. మొదట సీరియస్‌గా సాగిన ఈ ఇంటర్వ్యూ చివర్లో నవ్వులతో మార్మోగింది.

జగపతిబాబు ఆఖర్లో రామ్‌లోని మరో ఆసక్తికర కోణాన్ని బయటపెట్టాడు. "నువ్వు హీరోగానే కాకుండా పాటలు కూడా రాస్తావట కదా?" అని అడిగాడు. అందుకు రామ్ సిగ్గుపడుతూ నవ్వాడు. "అలా ఫీల్ గుడ్ సాంగ్స్ రాయాలంటే ప్రేమలో పడాల్సిందే కదా.. నువ్వెంతమందితో ప్రేమలో పడ్డావ్?" అని జగపతిబాబు చమత్కారంగా ప్రశ్నించగా, రామ్ చిరునవ్వుతో స్పందించాడు. దీనిపై జగ్గుభాయ్ మరింతగా సరదాగా మాట్లాడుతూ.. "ఏ ప్రశ్న అడిగినా సిగ్గుపడుతున్నావ్, ఏదో స్పెషల్ ఉన్నట్టుంది!" అంటూ టీజ్ చేశారు.

రామ్ కూడా తనదైన స్టైల్‌లో "ఆడియన్స్ అలా అరిస్తే సిగ్గుపడరా ఏంటి?" అంటూ సరదగా బదులిచ్చాడు. ఈ టాక్ షో ద్వారా రామ్ పోతినేని కేవలం హీరో మాత్రమే కాదు.. సింగర్, లిరిక్ రైటర్, లోతైన ఆలోచనలున్న వ్యక్తి అని జగపతిబాబు చెప్పకనే చెప్పాడు. హీరో రామ్ ఓ సినిమాకు ఒక ప్రముఖ సాహిత్య రచయితలా స్వయంగా పాట రాసినట్టు సమాచారం. అలాగే.. హీరో రామ్, నటి భాగ్యశ్రీతో ప్రేమలో ఉన్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే ఈ లవ్ సాంగ్ అంత రియలిస్టిక్‌గా రాసినట్టుగా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో రామ్‌లోని మరో కోణం బయటపడటంతో అభిమానులు ఫుల్ ఎగ్జైట్‌మెంట్‌లో ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X