For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RAPO: షాకిస్తోన్న రామ్ పోతినేని జిమ్ బాడీ ఫొటో.. వాడేంట్రా బాబు అలా మారిపోయాడు!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు వారసులుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు మాత్రమే స్టార్లుగా ఎదిగిపోయారు. అలాంటి వారిలో ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన రామ్ పోతినేని ఒకడు. 'దేవదాసు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఆరంభంలోనే పలు హిట్లను తన ఖాతాలో వేసుకుని సత్తా చాటాడు. అదే సమయంలో హ్యాండ్సమ్ లుక్స్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ సత్తా చాటాడు. ఇక, ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ ఎనర్జిటిక్ హీరో.. ఇప్పుడు ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఊహించని ఫొటోతో షాకిచ్చాడు. ఆ వివరాలు మీకోసం!

  ‘ఇస్మార్ట్'గా హిట్ ట్రాక్ ఎక్కిన రామ్

  ‘ఇస్మార్ట్'గా హిట్ ట్రాక్ ఎక్కిన రామ్

  చాలా కాలం పాటు ఫ్లాపుల పరంపరతో ఇబ్బందులు పడ్డాడు రామ్ పోతినేని. ఇలాంటి క్లిష్ట సమయంలో పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్' అనే సినిమాతో చాలా కాలం తర్వాత హిట్ ట్రాక్ ఎక్కాడు. పక్కా మాస్ మసాల కథతో వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది. అదే సమయంలో రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో అతడి కెరీర్ మారిపోయింది.

  ప్యాంట్‌ లేకుండా హీరోయిన్ ఘాటు ఫోజు: ప్రైవేట్ ఫొటో షేర్ చేసిన వర్మ.. మామూలోడు కాదుగా!

  సంక్రాంతికి మరో విజయం వచ్చింది

  సంక్రాంతికి మరో విజయం వచ్చింది

  ఈ ఏడాది సంక్రాంతికి రామ్ పోతినేని ‘రెడ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కిశోర్ తిరుమల తెరకెక్కించిన ఈ చిత్రంలో అతడు డుయల్ రోల్‌లో నటించాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఫలితంగా రామ్ ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. దీంతో అతడు వరుసగా రెండు హిట్లు కొట్టినట్లు అయింది.

  ద్విభాషా చిత్రంలో నటిస్తోన్న ఉస్తాద్

  ద్విభాషా చిత్రంలో నటిస్తోన్న ఉస్తాద్

  వరుస హిట్లను అందుకుంటూ ఫుల్ జోష్‌లో ఉన్న రామ్ పోతినేని ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామీతో ద్విభాషా చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన ఎప్పుడో వచ్చినప్పటికీ.. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఈ మధ్యనే రెగ్యూలర్ షూటింగ్‌ మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.

  Bigg Boss: ఆ అమ్మాయితో అక్కినేని నాగార్జున డేట్.. వామ్మో అందరి ముందే అలా అడిగేశాడేంటి!

  సినిమాకు సంబంధించిన వివరాలివే

  సినిమాకు సంబంధించిన వివరాలివే

  లింగుసామీ దర్శకత్వలో రామ్ పోతినేని నటిస్తోన్న సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. దీన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నాడు. ఇక, ఈ మూవీ ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇందులో రామ్ డుయల్ రోల్ చేస్తున్నాడట.

  అలాంటి సినిమా.. ఇలాంటి పాత్రలో

  అలాంటి సినిమా.. ఇలాంటి పాత్రలో

  రామ్ పోతినేని హీరోగా నటిస్తోన్న ఈ సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇది యాక్షన్ ఎంటర్‌టైనర్ అని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే, ఇటీవలే బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. ఈ చిత్రం రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంతో రూపొందుతుందనే టాక్ మొదలైంది. అందుకు అనుగుణంగానే ఇందులో రామ్ ఎంతో ఫిట్‌గా కనిపిస్తాడట.

  పవన్ కల్యాణ్ సెన్సేషనల్ రికార్డ్: ఒకే సినిమాతో రెండు ఘనతలు సొంతం.. ఇండియాలోనే ఏకైక హీరో

  Seetimaarr Movie Team Vinayaka Chaviti Special Interview
  షాకిస్తోన్న రామ్ పోతినేని జిమ్ ఫొటో

  షాకిస్తోన్న రామ్ పోతినేని జిమ్ ఫొటో

  రామ్ పోతినేని గతంలో సిక్స్ ప్యాక్‌తో కనిపించిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు లింగుసామీతో చేసే సినిమాలోనూ అతడు ఎంతో ఫిట్‌గా కనిపించబోతున్నాడు. ఇందుకోసం జిమ్‌లో తెగ కసరత్తులు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా కండలు చూపుతూ దిగిన రామ్ ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఇది చూసిన వాళ్లంతా ‘ఏమున్నాడురా బాబు' అంటూ నోరెళ్లబెడుతున్నారు.

  English summary
  Tollywood Star Hero Ram Pothineni Now Doing a Film Under Kollywood Director Lingusamy Direction. Now His Toned Body Photo Gone Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X