5000 లకుపైగా హౌస్‌ఫుల్స్‌తో కాంతార విధ్వంసం.. ముంబై థియేటర్‌లో రిషబ్‌కు అరుదైన గౌరవం!

కన్నడ సూపర్ స్టార్ రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ 1 చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్నది. దక్షిణాదిలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హోంబలే నిర్మాణంలో విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేస్తున్నది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రుక్మిణి వసంత్ నటించిన ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల, అన్ని భాషల్లో సంచలనాలు క్రియేట్ చేస్తున్నది. ఈ చిత్రం 10 రోజుల్లోనే 550 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ సినిమా ముంబైలో అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా కలెక్షన్లు, ముంబైలో సాధించిన ఘనతకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

కాంతార చిత్రం అనూహ్యమైన విజయం సాధించడంతో కాంతార చాప్టర్ 1 సినిమాకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ సృష్టించిన బజ్‌తో బిజినెస్ భారీగా జరిగింది. హిందీ వెర్షన్, నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ 96 కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్‌కు చేరువై లాభాలను సాధిస్తున్నట్టు ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు. గత 10 రోజుల్లో ఈ చిత్రం 131 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా ఇండియాలో 386 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 550 కోట్ల రూపాయలు రాబట్టింది.

Rishab Shetty gets grand welcome at Gaiety Galaxy theatre

ఇక కాంతార చాప్టర్ 1 చిత్రంలో నటించిన రిషబ్ శెట్టికి ముంబైలో అరుదైన గౌరవం లభించింది. ముంబైలోని ప్రసిద్ద గెయిటీ గెలాక్సీ థియేటర్‌కు వచ్చిన ఆయనను పూల వర్షం కురిపించి స్వాగతం పలికారు. అలాగే ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో ఆ థియేటర్‌కు వచ్చిన రిషబ్ శెట్టిని ఓపెన్ టాప్ వాహనంలో నిలుచోబెట్టి గ్రాండ్‌గా స్వాగతం పలికారు.

అయితే 2016 సంవత్సరంలో రిషబ్ శెట్టి నటించిన ఓ చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఒక్క స్క్రీనింగ్ కూడా లభించలేదు. కానీ 2025లో కాంతార చాప్టర్ 1 చిత్రం ఏకంగా 5000 లకుపైగా షోలు హౌస్‌ఫుల్‌తో నడవడం రికార్డుగా చెప్పుకోంటున్నారు. ఆయన సాగించిన జర్నీని సినీ విమర్శకులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రిషబ్ సాధించిన తిరుగులేని విజయాన్ని పురస్కరించుకొని అభిమానులు పండుగ జరుపుకొంటున్నారు.

మహారాష్ట్ర, ముంబైలో తన సినిమాకు వస్తున్న స్పందనపై రిషబ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్‌తో తనకు ఉన్న అనుభవాన్ని గుర్తు చేసుకొన్నారు. తాను ఓ నిర్మాతకు కారు డ్రైవర్‌గా పనిచేశాను. ఆ సమయంలో ముంబైలో వడపావ్ తింటూ బతికాను. ముంబై నాకు ఎంతో గొప్ప జీవితం ఇచ్చింది అని ఇటీవల ఆయన తన గత అనుభవాలను గుర్తు చేసుకొన్నారు. ముంబై పంచిన ప్రేమలో మునిగి తేలుతున్నాడు.

ఇదిలా ఉండగా, కన్నడలో ఈ సినిమా ఎదురులేని విజయాన్ని దక్కించుకొంటున్నది. ఈ చిత్రం కేవలం 10 రోజుల్లోనే 100 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం అత్యంత వేగంగా 150 కోట్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాకుండా కన్నడ భాషలో 200 కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి చిత్రం మరో రికార్డును సొంతం చేసుకొనేందుకు రెడీ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X