రాయల్ బెంగాల్ టైగర్‌కు ప్రభాస్ పేరు.. హైదరాబాద్ జూపార్కులో పులిని దత్తత తీసుకొన్నది ఎవరో తెలుసా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నారు. ఇప్పటికే ఎన్నో ఘనతలను సొంతం చేసుకొన్న ప్రభాస్‌కు హైదరాబాద్‌లోని నెహ్రూ జులాజికల్ పార్క్ అధికారులు అరుదైన గుర్తింపును ఇచ్చారు. తమ జూపార్క్‌లోని రాయల్ బెంగాల్ టైగర్‌కు ప్రభాస్ అని నామకరణం చేశారు.
ప్రభాస్ పేరు పెట్టుకొన్న రాయల్ బెంగాల్ టైగర్‌ను చూడటానికి ఆదివారం నెహ్రూ జిలాజికల్ పార్క్‌ను సందర్శకులు పోటెత్తారు. రాయల్ బెంగాల్ టైగర్ (ప్రభాస్ అని రాసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

రాయల్ బెంగాల్ టైగర్ గురించి జూ అధికారులు వెల్లడిస్తూ.. ప్రభాస్ వయసు 8 సంవత్సరాలు. సోషల్ మీడియాలో రాయల్ బెంగాల్ టైగర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత సందర్శకులు సంఖ్య పెరిగింది. చాలా మంది జంతు ప్రేమికులు వచ్చి ప్రభాస్ గురించి అడిగి తెలుసుకోవడం చాలా ఆశ్చర్యం ఉంది. పిల్లలు వచ్చి ప్రభాస్ గురించి అడిగి తెలుసుకొని సంతోషపడుతున్నారు అని సీనియర్ అధికారి వెల్లడించారు.

గతంలో కూడా ఓ పులికి తమిళ సూపర్ స్టార్ సూర్య పేరు పెట్టాం. అలాగే ఇండియా చైనా సరిహద్దులో శత్రువులతో పోరాడుతూ మరణించిన కల్నల్ సంతోష్ బాబు పేరును కూడా పులికి పెట్టాం అని తెలిపారు.
ఇక రాయల్ బెంగాల్ టైగర్ ప్రభాస్‌ను హైదరాబాద్‌కు చెందిన రచనా చౌదరీని దత్తత తీసుకొన్నారు. గత ఆరు నెలలుగా పులి సంరక్షణ తీసుకొంటున్నారు. ఆగస్టు 18వ తేదీ వరకు రచనా చౌదరీ దత్తత కొనసాగుతుంది అని జూపార్క్ అధికారులు వెల్లడించారు.
ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల పూజా హెగ్డేతో కలిసి నటించిన రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఆయన నటించిన చిత్రం ప్యాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ షూటింగు జరుగుతున్నది. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో ప్యాన్ ఇండియా చిత్రం ప్రాజెక్ట్ కే చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











