Don't Miss!
- News
అక్కడ అడుగుపెడితే విజయం ఖాయం?
- Lifestyle
Garuda Purana: లక్ష్మీ కటాక్షం సిద్ధించాలంటే ఉదయం లేవగానే ఈ పనులు చేయండి
- Sports
Union Budget 2023: క్రీడారంగంపై నిర్మలమ్మ కరుణ.. భారీగా పెరిగిన స్పోర్ట్స్ బడ్జెట్!
- Finance
Stock Market: హుషారుగా మార్కెట్లోకి వచ్చిన ఇన్వెస్టర్లు.. ఉసూరు మంటూ ఇంటికెళ్లారు..!
- Technology
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Jr NTR For Oscar: ఎన్టీఆర్ సంచలనం.. తారక్ కు రానున్న ఆస్కార్?.. అవార్డు రేసులో మొదటి స్థానం!
సుమారు ఐదు, ఆరు సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఆ సినిమా జపాన్ లోనూ దూసుకుపోతూ సత్తా చాటుతోంది. అంతేకాకుండా RRR చిత్రం ఇంటర్నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకుంటూ ప్రపంచ శిఖరంపై కూర్చుంది.
ఇప్పటికే గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్, సీటెల్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డులను సొంతం చేసుకుంది. ఇక ఆస్కార్ కోసం యావత్ భారత ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో యూఎస్ఏ ప్రముఖ పత్రిక ఒక సూపర్ న్యూస్ తెలిపింది.

రికార్డులను తిరగరాస్తూ..
వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. దర్శక దిగ్గజం రాజమౌళి తరెకెక్కించిన RRR (రౌద్రం రణం రుధిరం) సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ అయింది. అంతేకాదు, ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అలాగే, తారక్‌కు అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్‌ను తీసుకొచ్చి పాన్ వరల్డ్ స్టార్‌ను చేసేసింది.

అన్ని దేశాల్లోనూ..
జూనియర్ ఎన్టీఆర్ RRR (రౌద్రం రణం రుధిరం) సినిమాలో కొమరం భీమ్ పాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ నటన, పలికించిన హావభావాలు, చూపించిన ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కింది. ఒక్క ఇండియాలోనే కాకుండా ఈ సినిమా విడుదలైన అన్ని దేశాల్లోనూ తారక్ నటనకు అక్కడి ప్రేక్షకులు నీరాజనం పలికారు.

ఇంటర్వెల్ సీన్ లో..
అత్యధిక బడ్జెట్‌తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR (రౌద్రం రణం రుధిరం) సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన తీరుకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇంటర్వెల్ లో అడవి మృగాలతో ఎన్టీఆర్ కనిపించిన తీరు యావత్ సినీ లోకాన్ని ఆశ్చర్యపరిచింది. ఫలితంగా యంగ్ టైగర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఇండియాలోనే కాదు.. అతడి కీర్తి విశ్వవ్యాప్తం అయిపోయింది. దీంతో అతడి మార్కెట్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోయిందని అనుకోవచ్చు.

మీడియా సంస్థల సర్వేలు..
ఇదిలా ఉంటే RRR సినిమా అధికారికంగా ఆస్కార్ ఎంట్రీ దక్కించుకోలేకపోయింది. ఇండిపెండెంట్ కేటగిరీలో నామినేట్ అయింది. ప్రస్తుతం ఆస్కార్ ఓటింగ్ కొనసాగుతోంది. ఆస్కార్ ఓటర్స్ తమ నామినేషన్స్ ను అకాడమీ అవార్డ్స్ కు పంపిస్తున్నారు. ఇప్పటికే ఏఆర్ రెహమాన్ తన ఓటు హక్కు వినియోగించుకోగా.. ఆస్కార్ నామినేషన్స్ అధికారికంగా ప్రకటించడానికి ముందుగా అమెరికాకు చెందిన పలు మీడియా సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఆస్కార్ నామినేషన్ జాబితాలను విడుదల చేస్తున్నాయి.

ఎన్టీఆర్ కు మొదటి ర్యాంక్..
తాజాగా యూఎస్ఏ టుడే (USA Today) పోర్టల్ ఆస్కార్ రేసులో నిలిచే టాప్ 10 హీరోల ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు టాప్ ప్లేస్ అంటే మొదటి స్థానం ఇచ్చింది. అమెరికాలోనే ప్రముఖ పత్రిక అయిన యూఎస్ టుడే ఇండియన్ యాక్టర్ ఎన్టీఆర్ కు టాప్ ర్యాంక్ ఇవ్వడం సెన్సేషన్ గా మారింది. దీన్ని బట్టి చూస్తుంటే తారక్ కు ఆస్కార్ వచ్చే సూచనలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

క్రూర జంతువులను పోషించడం..
ఈ సందర్భంగా RRR సినిమా ఎన్టీఆర్ యాక్టింగ్ పై యూఎస్ టుడే పోర్టల్ పలు వ్యాఖ్యలు చేసింది. "RRR ఒక యాక్షన్ ప్యాక్డ్ మ్యాజికల్ అడ్వెంచర్. ఇద్దరు ఇండియన్ యాక్టర్స్ ఆడియన్స్ ను ఫ్రెండ్లీ పవర్ హౌజ్ గా మార్చారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫైట్స్, డ్యాన్స్ అద్భుతంగా ఉన్నాయి. కానీ ఇద్దరిలో ఒక్కరిని మాత్రమె సెలెక్ట్ చేయాలి కాబట్టి.. క్రూర జంతువులను పోషించడం, మోటార్ సైకిల్ లాంటి అడ్వెంచర్స్ చేయడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ ను నామినేట్ చేస్తున్నాం" అని వెల్లడించింది.
|
USA Today టాప్ 10 బెస్ట్ యాక్టర్స్ లిస్ట్..
1. జూ. ఎన్టీఆర్ (RRR)
2.
టామ్
క్రూజ్
(టాప్
గన్:
మావెరిక్)
3.
పాల్
డానో
(ది
బ్యాట్
మేన్)
4.
మియాత్
గోత్
(పెర్ల్)
5.
నైనా
హోస్
(టార్)
6.
జియో
క్రావిట్జ్
(కిమి)
7.
లాషనా
లించ్
(ది
ఉమెన్
కింగ్,
మటిల్డా
ది
మ్యూజికల్)
8.
పాల్
మెస్కల్
(ఆఫ్టర్
సన్)
9.
కెకె
పామర్
(నోప్)
10.
జెరెమీ
పోప్
(ది
ఇన్
స్పెక్షన్)