For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR: ఆయన లేడని ఏడవను.. నా తల్లి కోరిక తీరలేదు.. మెగా ఫ్యాన్స్ మనసు దోచేలా ఎన్టీఆర్ కామెంట్స్

  |

  దేశమే గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి.. బాహుబలి వంటి సక్సెస్‌ఫుల్ సిరీస్ తర్వాత చేస్తున్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తొలిసారి కలిసి నటిస్తున్నారు. దీంతో ఆరంభంలోనే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా అంచనాలను సైతం భారీ స్థాయిలో ఏర్పరచుకుంది. ఎన్నో బ్రేకుల తర్వాత ఈ సినిమా మరో ఐదు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ తనదైన స్పీచ్‌తో ఆకట్టుకున్నాడు. అసలు అతడేం మాట్లాడాడో చూద్దాం పదండి!

  ఎన్టీఆర్, చరణ్ కాంబోలో RRR

  ఎన్టీఆర్, చరణ్ కాంబోలో RRR

  తెలుగు గడ్డపై విప్లవ వీరులుగా పేరొందిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి తీసిన మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం ఇచ్చారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఈ సినిమాలో తారక్.. కొమరం భీం, చరణ్.. అల్లూరి పాత్రలను పోషించారు.

  డోస్ పెంచేసిన సీరియల్ హీరోయిన్: బీచ్‌లో చిన్న క్లాత్‌తో కొత్త పెళ్లికూతురు రచ్చ

  ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్

  ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్


  ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీని మార్చి 25న ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ఈ సినిమా పేరు దేశ వ్యాప్తంగానే కాదు.. ఇంటర్నేషనల్ రేంజ్‌లో మారుమ్రోగుతోంది. ఫలితంగా రిలీజ్‌కు ముందే ఇది హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా ఈ సినిమా పేరు భారీ స్థాయిలో హాట్ టాపిక్ అయిపోతోంది.

  ప్రీ రిలీజ్ ఫంక్షన్ వైభవంగానే

  ప్రీ రిలీజ్ ఫంక్షన్ వైభవంగానే

  బడా మల్టీస్టారర్‌గా వస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం) రిలీజ్‌కు సమయం దగ్గర పడడంతో కర్నాటకలోని చిక్‌ బల్లాపూర్‌లో శనివారం సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుకకు ఫ్యాన్స్ వేలాదిగా తరలి వచ్చారు. దీనికి ముఖ్య అతిథిగా కర్నాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, శివరాజ్‌కుమార్ విచ్చేశారు. పలువురు ప్రముఖులూ హాజరయ్యారు.

  Bigg Boss Non Stop: షోలో అసభ్యకరమైన సీన్.. పూల్‌లో వాళ్లిద్దరి సరసాలు.. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి

  ఏడవొద్దు.. సెలబ్రేట్ చేయండి

  ఏడవొద్దు.. సెలబ్రేట్ చేయండి


  ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తారక్ మాట్లాడుతూ.. 'శివరాజ్ కుమార్ అన్నకి ధన్యవాదాలు. పునీత్ సార్ పార్థివ దేహాన్ని చూడటానికి వచ్చినప్పుడు నాకు అనిపించింది. ఈ గాల్లో, నేలలో, మట్టిలో ఆయన ఉన్నట్టు అనిపించింది. అందుకే ఈరోజు చల్లని చిరుజల్లులతో మనల్ని పలకరించారు. పునీత్ సార్ మనతో లేడని నేను ఎప్పుడూ ఏడ్వలేదు. పునీత్ సర్ అంటే సెలెబ్రేషన్స్. ఆయన్ను ఎప్పుడూ సెలెబ్రేట్ చేస్తూనే ఉందాం' అని వెల్లడించాడు.

  మా అమ్మ కోరిక.. నాకు దక్కింది

  మా అమ్మ కోరిక.. నాకు దక్కింది

  ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ తన తల్లి కోరిక గురించి మాట్లాడాడు. 'నేను కన్నడలో మాట్లాడితే వినాలని మా అమ్మ కోరిక. అంతేకాదు, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్‌ గారిని ఎలాగైనా ప్రత్యక్షంగా చూడాలని ఎప్పుడూ కలలు కంటూ ఉండేది. కానీ, ఆమెకు ఆ కోరిక తీరలేదు. అయితే, ఆ భాగ్యం మాత్రం నాకు దక్కింది. మా తల్లిగారిది కూడా కర్నాటకే అని తెలిసిందే' అని చెప్పుకొచ్చాడు.

  శృతి మించిన జాన్వీ కపూర్ హాట్ ట్రీట్: ఎద అందాలు పూర్తిగా కనిపించేంత ఘోరంగా!

  రాజమౌళిపై తారక్ ప్రశంసలు

  రాజమౌళిపై తారక్ ప్రశంసలు


  RRR గురించి మాట్లాడుతూ.. 'ఇది కేవలం సినిమా కాదు. ప్రాంతీయ చిత్రాల హద్దులను చెరిపేసి.. భారతీ సినిమాగా చేయాలని కలగనే దర్శకుడు. ఈ చిత్రంలో నాకు ఒక చిన్న పాత్ర ఇచ్చినందుకు థ్యాంక్స్. మీరు కట్టబోయే రామసేతులో నాకు ఉడతలాంటి సాయం చేసే అవకాశం ఇచ్చినందుకు రాజమౌళికి థ్యాంక్స్. అలాగే, యూనిట్‌కు ధన్యవాదాలు' అన్నాడు తారక్.

  Recommended Video

  RRR Road Show: NTR, Ram Charan And Rajamouli Visits Statue of Unity | Filmibeat Telugu
  మెగా ఫ్యాన్స్ మనసు దోచేస్తూ

  మెగా ఫ్యాన్స్ మనసు దోచేస్తూ


  ఈ వేడుకలో తారక్ 'నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తులు నా అభిమానులు. మీ అభిమానంతో పాటు నా బ్రదర్ చరణ్ అభిమానులు మాకు దక్కారు. ఎల్లప్పుడూ మీ అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఎంత సఖ్యతగా ఉంటే అన్ని మంచి చిత్రాలు వస్తాయి. రామ్ చరణ్‌తో ఈ బంధం ఎప్పుడూ ఇలానే ఉండాలని, మా సాన్నిహిత్యం, ఫ్రెండ్ షిప్‌కు దిష్టి పడకుండా ఉండాలని, నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలని కోరుకుంటున్నా' అంటూ కోరుకున్నాడు.

  English summary
  Jr NTR and Ram Charan Starring RRR Movie under Rajamouli Direction. Jr NTR Reminds Puneeth and Praises on Charan and Rajamouli in Pre Release Event
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X