బాత్రూమ్‌లో నగ్నంగా దొరికిపోయిన స్టార్ హీరో.. ఆ నటుడు డోర్ తీసేసరికి..
బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకడిగా వెలుగొందుతున్నారు సైఫ్ అలీఖాన్. రాజవంశీయుడైనా, బలమైన బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ హీరోగా నిలదొక్కుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డారు సైఫ్. వ్యక్తిగతంగా, వృత్తిగతంగా సమస్యలు ఎదురైనా వాటిని ఎదుర్కొని నిలబడ్డారు. వేల కోట్లకు అధిపతి అయినప్పటికీ నిరాడంబరంగా ఉంటారు సైఫ్. హిందీ సినీ పరిశ్రమలోని అందరు హీరోలు, నటీనటులతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. తాజాగా ఓ సినిమా షూటింగ్ సమయంలో చోటు చేసుకున్న సంఘటనను ఆయన గుర్తుచేసుకున్నారు.
30 ఇయర్స్ ఇండస్ట్రీ
1993లో పరంపర అనే సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు సైఫ్ అలీఖాన్. బాలీవుడ్ దిగ్గజం యశ్ రాజ్ చోప్రా ఈ సినిమాకు దర్శకుడు. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ హీరోగా ఎదిగారు సైఫ్ అలీఖాన్. ఆయన నటనకు జాతీయ చలన చిత్ర అవార్డ్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌తో పాటు భారతీయ సినిమాకు చేసిన సేవలకు గాను అత్యున్నత పద్మశ్రీ పురస్కారంతోనూ సైఫ్ అలీఖాన్‌ను సత్కరించింది భారత ప్రభుత్వం.

నాపై దాడిని నాటకమన్నారు
తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన టూ మచ్ టాక్ షోలో తన సహనటులు అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా, కాజోల్‌లతో కలిసి ముచ్చటించిన ఆయన నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అలాగే ఇటీవల తనపై దుండగుడి దాడిపై మీడియాలో వచ్చిన కథనాలపై ఆవేదన వ్యక్తం చేశారు. తాను చావు అంచుల దాకా వెళ్లొచ్చానని.. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో అంబులెన్స్, వీల్ చైర్‌లో వస్తే అభిమానులు బాధపడతారని బాధను పంటి బిగువున భరిస్తూనే నడుచుకుంటూ వచ్చానని సైఫ్ చెప్పారు. దాంతో తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని.. ఇదంతా డ్రామా అన్నట్లుగా కొందరు రాసుకొచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నగ్నంగా సైఫ్
ఇక ఓ సినిమా షూటింగ్ సమయంలో బట్టలు లేకుండా నగ్నంగా దివంగత నటుడు సయీద్ జాఫ్రీకి ఎలా దొరికిపోయావని సైఫ్‌ను ట్వింకిల్ ఖన్నా ప్రశ్నించారు. దానికి కాజోల్, అక్షయ్, సైఫ్‌లు పకపకా నవ్వారు. యే దిల్లగి చిత్రీకరణ హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో జరిగిందని.. జాఫ్రీ సాబ్ కొన్ని రకాల డ్రింక్స్ తాగేవాడని, పబ్లిక్ ఫంక్షన్‌లలో నా భుజంపై తలవాల్చి పడుకునేవాడు. ఆ తర్వాత మేల్కొని నువ్వు ఎవరు? అని అడుగుతూ చాలా సరదాగా ఉండేవాడని సైఫ్ తెలిపారు.
డోర్ తీసిన నటుడు
సిమ్లా హోటల్‌లో నాకు, సయీద్‌కు పక్క పక్క గదులు కేటాయించారు. అయితే తన గది సంగతి మరిచిపోయి, నా గదిలోకి వచ్చాడు. ఆపై స్నానం చేయాలనుకుని, బట్టలు విప్పేసి.. బాత్‌రూంలోకి వచ్చాడు. కర్టెన్ తెరిచి చూసేసరికి నేను నగ్నంగా కనిపించా. అతనికి ఏం అర్ధం కాక సైఫ్ నా బాత్రూంలో ఏం చేస్తున్నాడు? అని ఆలోచిస్తూ ఉండిపోయాడని సైఫ్ చెప్పడంతో అందరూ నవ్వేశారు. ఆ వెంటనే అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. సైఫ్ తన బాత్‌రూమ్‌లోనే ఉన్నాడని, కాకపోతే డోర్స్ లాక్ చేసుకోవడం మరిచిపోయాడని చెప్పాడు. సో అదన్న మాట మేటర్.


Click it and Unblock the Notifications











