Salman Khan మూవీలో 10మంది దక్షిణాది టాప్ హీరోయిన్లు.. సమంత, రష్మిక, పూజా హెగ్డే.. ఇంకా ఎవరెవరంటే?
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ 2022 సంవత్సరంలో వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే గతంలో భారీ విజయం అందుకొన్న నో ఎంట్రీ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న నో ఎంట్రీ మెయిన్ ఎంట్రీ మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాను భారీ తారాగణంతో రూపొందించనున్నారు. అయితే సల్మాన్ ఖాన్ పక్కన నటించే హీరోయిన్ కోసం నలుగురిని లైన్‌లో పెట్టారు. కానీ ఆ అవకాశం ఎవరికి దక్కుతుందనే విషయంలోకి వెళితే..

నిర్మాతగా బోని కపూర్
ప్రముఖ నిర్మాత బోని కపూర్ రూపొందిస్తున్న నో ఎంట్రీ మెయిన్ ఎంట్రీ సినిమాలో అనిల్ ఖాన్, ఫర్దీన్ ఖాన్‌తోపాటు సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. అనీజ్ బాజ్మీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం దక్షిణాదికి చెందిన హీరోయిన్లను, నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు.

సౌత్, బాలీవుడ్ నుంచి 10 మంది హీరోయిన్లు
ఇక నో ఎంట్రీ మెయిన్ ఎంట్రీ చిత్రంలో 10 మంది హీరోయిన్లు నటించనునున్నారు. అయితే దక్షిణాదికి చెందిన టాప్ హీరోయిన్ల పేర్లను ఇప్పటికే పరిశీలిస్తున్నారు. అందులో రష్మిక మందన్న, సమంత రుత్ ప్రభు, పూజా హెగ్డే, తమన్నా భాటియా లాంటి హీరోయిన్లు దాదాపు ఖారారైనట్టు సమాచారం.

సమంత, రష్మిక, పూజా హెగ్డేపై నజర్
అయితే దక్షిణాదిలో సమంత, రష్మిక, పూజా, తమన్నా భాటియాకు విపరీతమైన క్రేజ్ ఉన్నందున వారితోపాటు మరికొందరి హీరోయిన్లను తీసుకొనేందుకు వేట ప్రారంభించారు. అయితే ఈ చిత్రంలోని నటీనటులు పేర్లను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చిత్ర యూనిట్ పేర్కొన్నది.

టాప్ హీరోయిన్లు సై అంటారా?
అయితే సమంత, రష్మిక, పూజా హెగ్డే, తమన్నా భాటియా ఇప్పటికే చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే సల్మాన్ ఖాన్ సినిమాలో నటించేందుకు సిద్దమవుతారా అనేది వేచి చూడాల్సిందే. అయితే సల్మాన్ ఖాన్ సరసన నలుగురైగుదురు హీరోయిన్లు అనే వార్త ఫ్యాన్స్‌లో జోష్ నింపింది.

సల్మాన్ ఖాన్ సినిమా కెరీర్ ఇలా..
ఇదిలా ఉండగా, సల్మాన్ ఖాన్ భారీ, క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం టైగర్ 3 సినిమా షూటింగును ఇటీవలే పూర్తి చేసుకొన్నారు. షారుక్ ఖాన్‌తో పఠాన్ సినిమాలో కీలక పాత్ర కోసం సిద్దమవుతున్నారు. అలాగే కబీ ఈద్ కబీ దివాళీ, కిక్ 2, భజరంగీ భాయ్‌జాన్ 2 చిత్రాల్లో నటించనున్నారు. అమీర్ ఖాన్‌తో ఆయన నటించిన లాల్ సింగ్ చద్దా, చిరంజీవితో గాడ్ ఫాదర్ చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











