శ్రీకృష్ణుడి అవతారంలో సంపూర్ణేష్ బాబు.. ఓ పనైపోయింది
కామెడీ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మరో విభిన్నమైన సినిమాతో రెడీ అవుతున్నాడు. కేవలం హీరోగానే కాకుండా ఇతర సినిమాల్లో కూడా విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ వస్తున్న సంపూర్ణేష్ బాబు ఎలాంటి సినిమా చేసినా కూడా సోషల్ మీడియాలో మంచి బజ్ అయితే క్రియేట్ అవుతోంది.
సంపూర్ణేష్ బాబు క్యామియో పాత్రలకు కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాడు. ఇక చివరగా కొబ్బరి మట్ట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్న ఈ కామెడీ నటుడు ఇప్పుడు క్యాలి ఫ్లవర్ అనే సినిమాతో రెడీ అవుతున్నాడు. ఇక రీసెంట్ గా సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కావడంతో ప్రమోషన్ లో భాగంగా సంపూర్ణేష్ బాబు సరికొత్త పోస్టర్ ను విడుదల చేశారు.

ఆ పోస్టర్ లో సంపూర్ణేష్ బాబు శ్రీకృష్ణుడి అవతారంలో కనిపిస్తుండడంతో నిమిషాల్లోనే అది వైరల్ గా మారింది. ఇదివరకే సంపూర్ణేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా క్యాలీఫ్లవర్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేయగా దానికి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ సినిమాతో మరోసారి కంప్లీట్ గా కామెడీతో ఆకట్టుకునేలా ఉన్నాడని అనిపిస్తోంది.
ఇక త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాతో పాటు సంపూర్ణేష్ బాబు మరో రెండు సినిమాలతో కూడా బిజీ కానున్నాడు. మరి క్యాలీఫ్లవర్ సినిమాతో బర్నింగ్ స్టార్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











