For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేశ్ బర్త్‌డేకు ఏకంగా మూడు సర్‌ప్రైజ్‌లు: అర్ధరాత్రి నుంచే వచ్చేలా ప్లాన్ చేసిన టీమ్స్

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోని బడా హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. హ్యాండ్సమ్ లుక్స్, అదిరిపోయే యాక్టింగ్, పర్‌ఫెక్ట్ మేనేజ్‌మెంట్‌తో సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో తన హవాను చూపిస్తోన్న అతడు.. వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటాడు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో వరుసగా కొరటాల శివ తెరకెక్కించిన 'భరత్ అనే నేను' సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ వెంటనే వంశీ పైడిపల్లితో 'మహర్షి', ఆ తర్వాత అనిల్ రావిపూడితో 'సరిలేరు నీకెవ్వరు' వంటి చిత్రాలు చేసి హ్యాట్రిక్ హిట్లను అందుకున్నాడు. ఈ జోష్‌లో మరిన్ని చిత్రాలను లైన్‌లో పెడుతున్నాడు.

  Evaru Meelo Koteeswarulu: సీఎం అవడం కంటే అదే ముఖ్యం.. ఆ అమ్మాయితో ఎన్టీఆర్ సూపర్ మెసేజ్

  ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేశ్ బాబు తన పుట్టినరోజును జరుపుకోనున్నాడు. దీంతో అతడి అభిమానులు నెల రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే అడ్వాన్స్ విషెస్ చెబుతూ ట్వీట్లు చేసి రికార్డు క్రియేట్ చేశారు. అలాగే, కొన్ని హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేసి ట్రెండ్ సెట్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం అతడు నటిస్తోన్న సినిమా యూనిట్లు కూడా ఆరోజున సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మహేశ్ పుట్టినరోజున ఏకంగా మూడు కానుకలు రాబోతున్నాయని తాజాగా ఓ న్యూస్ లీకైంది.

  Sarkaru Vaari Paata Teaser, SSMB28 Poster and Onther Look Will Release on Mahesh Babu Birthday

  మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న 'సూపర్ స్టార్ బర్త్‌డే బ్లాస్టర్' అనే పేరిట 'సర్కారు వారి పాట' మూవీ యూనిట్ ఓ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. ఇక, ఇది ఆ సినిమాకు సంబంధించిన టీజరే అని అంతా అనుకుంటున్నారు. దీంతో ఈ సర్‌ప్రైజ్ కోసం ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్ కూడా రాబోతుందట. దాన్ని ఏకంగా అర్ధారాత్రి 12 గంటలకే విడుదల చేయడానికి ప్లాన్ చేశారని తెలిసింది. ఇది ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్ అన్న టాక్ వినిపిస్తోంది.

  సింగర్ సునీత పర్సనల్ ఫొటోలు: హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా.. ఆమెను మీరెప్పుడూ ఇలా చూసుండరు!

  ప్రస్తుతం మహేశ్ బాబు 'సర్కారు వారి పాట'లో నటిస్తున్నాడు. అదే సమయంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దీనికి సంబంధించిన ప్రకటన కూడా ఎప్పుడో వెలువడింది. ఇక, మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టు నుంచి కూడా ఓ పోస్టర్ రాబోతుందని తెలుస్తోంది. ఇందులో ఈ స్టార్ హీరోకు శుభాకాంక్షలు చెబుతూ ఫస్ట్ లుక్‌ను వదులుతున్నారని అంటున్నారు. అంటే.. ఆరోజున ఏకంగా మూడు సర్‌ప్రైజ్‌లు రాబోతున్నాయన్న మాట. దీనిపై సూపర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

  ఇదిలా ఉండగా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట' మూవీ బ్యాంకులను మోసం చేసే బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ విమర్శనాత్మకంగా రూపొందుతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా హీరో తండ్రైన బ్యాంకు ఉద్యోగిని మోసం చేసిన విలన్.. విదేశాలకు పారిపోతాడు. అప్పుడు హీరో.. తన తండ్రి నిజాయితీని నిరూపించేందుకు విలన్‌ను ఎలా పట్టించాడనేదే ఈ మూవీ కథ అంటున్నారు. ఇక, ఈ సినిమా అన్ని హంగులతో కలిసి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.

  English summary
  Mahesh Babu Will Celebrate His Birthday On August 9th. On The Accasion of This DAy.. Sarkaru Vaari Paata Teaser, SSMB28 Poster and Onther Look Will Released.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X