అందుకే నీవు దళపతివి.. మంచి పార్టీతో కలుద్దాం.. విజయ్‌కు షారుక్ ఖాన్ ట్వీట్

బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్‌కు దక్షిణాది సినిమా పరిశ్రమతోను, అలాగే సినీ నటులతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. దక్షిణాదిలో షారుక్ ఖాన్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ కూడా ఉంది. తమిళనాడు బ్యాక్ డ్రాప్‌తో చెన్నై ఎక్స్‌ప్రెస్ భారీ విజయాన్ని అందుకొన్నది. ఇక పఠాన్ సినిమా తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో ఓ క్రేజీ ప్రాజెక్టుతో సిద్దమవుతున్నారు. తమిళ, తెలుగు ప్రేక్షకులతో అనుబంధాన్ని కొనసాగుతున్న షారుక్ ఖాన్ తాజాగా తమిళ ఇళయదళపతి విజయ్ గురించి ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ వివరాల్లోకి వెళితే..

సూపర్ స్టార్ విజయ్ తాజాగా వారిసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తెలుగు నిర్మాత, దర్శకుడు దిల్ రాజు, వంశీ పైడిపల్లి ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం జనవరి 11న తమిళంలో, జనవరి 14వ తేదీన తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో విజయ్‌కి షారుక్ ఖాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

థ్యాంక్యూ మై ఫ్రెండ్ విజయ్. నీ నిజాయితీ, ఇతరులకు ఇచ్చే గౌరవం కారణంగానే నీవు దళపతివి అయ్యావు. మంచి పార్టీతో మనం త్వరలోనే కలుసుకొంటాను అని షారుక్ ఖాన్ అన్నారు. ఈ ట్వీట్‌తో షారుక్, విజయ్ మధ్య ఉన్న అనుబంధం ఏమిటో స్పష్టమైంది. వీరిద్దరి అనుబంధానికి కారణం దర్శకుడు అట్లీ అనే విషయాన్ని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

 Shah Rukh Khan to meet Thalapathy Vijay with delicious feast before Pathaan

ఇక షారుక్ ఖాన్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. రెండేళ్లకుపైగా గ్యాప్ తర్వాత షారుక్ ఖాన్ మళ్లీ పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. అట్లీ దర్శకత్వంలో జవాన్, ఇంకా టైగర్ 3, డంకీ చిత్రాల్లో నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X