Sivakarthikeyan: మదరాసి కోసం శివకార్తీకేయన్‌కు రికార్డ్ రెమ్యునరేషన్? ఎన్ని కోట్లంటే?

ఒక్కో సినిమాను హిట్ చేసుకుంటూ హీరోగా తన స్థాయిని, తన స్థానాన్ని పెంచుకుంటున్నారు కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరో ఫ్రెండ్ వంటి చిన్నాచితకా వేషాలతో కెరీర్ ప్రారంభించిన శివకార్తీకేయన్.. ఇప్పుడు కోలీవుడ్‌లో 300 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లు సాధించిన హీరోలలో ఒకరు. తాజాగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మదరాసి సినిమాలో శివకార్తీకేయన్ నటించారు. ఈ మూవీకి గాను ఆయన రెమ్యునరేషన్ ఎంత? అనేది పరిశీలిస్తే..

మిమిక్రీ ఆర్టిస్ట్‌గా ప్రస్థానం
మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన శివకార్తీకేయన్.. తొలుత టీవీ ఇండస్ట్రీలో యాంకరింగ్ చేసేవాడు. నటనపై ఆసక్తితో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. ఈ దశలో ఎగన్ అనే మూవీతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు ఎస్కే. షూటింగ్ ముగిసిన తర్వాత ఎడిటింగ్‌లో శివకార్తీకేయన్ రోల్‌ను కట్ చేయడంతో ఆయన ఎంతో బాధపడ్డారు. అయితే 2012లో మెరీనా సినిమాతో శివకార్తీకేయన్‌ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన రొమాంటిక్, ప్రేమ కథా చిత్రం 3లో ఆయనకు ఫ్రెండ్‌గా నటించి మంచి మార్కులు కొట్టేశారు.

Sivakarthikeyan s remuneration for Madharaasi SK received a massive pay cheque for AR Murgadoss s film

అమరన్‌తో కలెక్షన్ల వర్షం
ఈ సినిమా ఘన విజయం సాధించడంతో శివకార్తీకేయన్‌కు హీరోగా అవకాశాలు వచ్చాయి. రెమో, వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్ అనే సినిమాలతో యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. తమిళంతో పాటే తెలుగులోనూ ఆయనకు భారీగా క్రేజ్ ఏర్పడింది. దీంతో ప్రిన్స్ అనే స్ట్రెయిట్ తెలుగు సినిమాలో శివకార్తీకేయన్ నటించారు. ఇక గతేడాది వచ్చిన అమరన్ సినిమాతో రికార్డుల్ని తిరగరాశాడు ఎస్కే. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా ఏకంగా 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి శివకార్తీకేయన్ స్టామినా ఏంటో రుజువు చేసింది. ఈ సినిమాతో ఆయనకు మాస్ ఫాలోయింగ్‌తో పాటు స్టార్‌డమ్ దక్కింది. బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల క్లబ్‌లో చేరిన హీరోగా.. రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ వంటి సూపర్‌స్టార్ల సరసన చేరారు శివకార్తీకేయన్. ఈ సినిమా తర్వాత తదుపరి ఇళయ దళపతిగా అభిమానులు ఆయనను వ్యవహరిస్తున్నారు.

సెప్టెంబర్ 5న మదరాసి
తాజాగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మదరాసిలో నటించారు ఎస్కే. ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో శివకార్తీకేయన్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించారు. విద్యుత్ జమవాల్, బిజు మీనన్, విక్రాంత్, ప్రేమ్ కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సుదీప్ ఎలమన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ఇతర ప్రమోషనల్ ఖర్చులు కలిపి మదరాసి సినిమాకు 200 కోట్ల రూపాయల వ్యయమైంది.

మదరాసికి శివకార్తీకేయన్ రెమ్యునరేషన్ ఎంతంటే?
ఇదిలాఉండగా.. అమరన్ తర్వాత శివకార్తీకేయన్ నటిస్తోన్న సినిమా కావడంతో మదరాసికి ఆయన రెమ్యునరేషన్ కింద ఎంత ఛార్జ్ చేశారనేది కోలీవుడ్‌లో ఆసక్తిగా మారింది. సినిమా సినిమాకు ఎస్కే పారితోషికం కూడా బాగా పెరిగిపోతోంది. అయాలన్ సినిమాకు 15 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో 40 శాతం వాటా తీసుకున్నారు శివకార్తీకేయన్. ఇక ఆయన గత చిత్రం అమరన్‌కు గాను ఏకంగా 30 కోట్ల రెమ్యునరేషన్‌ అందుకున్నారు. ఇది ఆ సినిమా మొత్తం బడ్జెట్‌లో 33 శాతానికి సమానం. తాజాగా మదరాసి సినిమాకు గాను శివకార్తీకేయన్ పారితోషికం కింద 40 కోట్ల రూపాయలతో పాటు లాభాల్లో పెద్ద ఎత్తున వాటా పొందనున్నారని కోలీవుడ్ టాక్. ఇది శివకార్తీకేయన్ మార్కెట్ విస్తృతి, ఆయన క్రేజ్‌కు అద్దం పడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X