twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్, రామ్ చరణ్ చేస్తున్న పనులపై సోనూసూద్ కామెంట్స్.. సంతోషంగా ఉందంటూ..

    |

    గత ఏడాది కరోనా వైరస్ మొదలవ్వగానే అందరికంటే వేగంగా సహాయలు అందించిన ఏకైక నటుడు సోనూసూద్. ఉచిత రవాణా సౌకర్యం నుంచి మొదలైన అతని సహాయలు ఇప్పటికీ కూడా ఆగలేదు. లాక్ డౌజ్ అనంతరం కూడా ఎంతోమంది పేద వారికి సహాయం చేశాడు. పేద రైతులకు కూడా అండగా నిలిచాడు. ఖర్చు ఎంత అవుతున్నా కూడా వెనక్కి తగ్గని సోనూసూద్ ఇటీవల ఆక్సిజన్ పంపిణీ కోసం ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది విషయం తెలిసిందే.

    కోట్ల రూపాయలతో ఏకంగా ఆక్సిజన్ ప్లాంట్స్ నిర్మించి అవసరం ఉన్న హాస్పిటల్స్ లో ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్స్ ను అందించాడు. అయితే అదే తరహాలో ఇటీవల మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల్లో ఉచితంగా ఆక్సిజన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా పేద వారికి ఆక్సిజన్ ను అంధించారు. అవసరం అయితే ఇంటికి చేరువయ్యేలా చేసి ఎంతోమందికి అండగా నిలిచారు.

    Sonu sood positive comments on megastar chiranjeevi oxygen banks

    ఇక ఆ విషయం గురించి తెలుసుకున్న సోనూసూద్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి పై అలాగే రామ్ చరణ్ పై పాజిటివ్ గా స్పందించారు. వారు ఇద్దరు కూడా అవసరమైన వారికి ఆక్సిజన్ ను సకాలంలో అందిస్తున్నారని తెలిసింది. నిజంగా ఆ గొప్ప పని గురించి తెలుసుకోగానే నేను ఎంతగానో సంతోషించాను అంటూ సోనూసూద్ వివరణ ఇచ్చారు. అలాగే గతంలో సోనూసూద్ సహాయాలపై కూడా మెగాస్టార్ పాజిటివ్ గా స్పందించారు. ఆచార్య సినిమాలో సోనూసూద్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.

    English summary
    Sonu Sood, who has earned a unique recognition on the Indian silver screen as the Senior Most Villain, has gained fans regardless of language. He did a lot of films especially in Telugu. That's why whenever I come here they say this is my second home. It is known that Sonu Sood has been getting closer to the masses as a real hero for the last while.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X