Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
తండ్రికి కొడుకు ఇవ్వగల బహుమతి.. సైరాపై భావోద్వేగమైన అల్లు అర్జున్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కు మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రత్యేకమైన అభిమానమన్న సంగతి అందరికీ తెలిసిందే. చిరంజీవిని అత్యధికంగా గౌరవించేవారిలో అల్లు అర్జున్ ముందు వరుసలోఉంటాడు. అలాంటి బన్నీ సైరా వేడుకలో కనబడకపోయేసరికి మెగా అభిమానులు కాస్త అసంతృప్తికి లోనయ్యారు. అయితే తాజాగా బన్నీ సైరా గురించి సుధీర్ఘమైన పోస్టచేశాడు.

ఈవెంట్‌లో మెగా హీరోల జోరు
సెప్టెంబర్ 22న అట్టహాసంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకలో దర్శకధీరుడు జక్కన్న, వివి వినాయక్, కొరటాల శివలతో పాటు దాదాపు మెగా హీరోలంతా హాజరయ్యారు. ప్రత్యేక ఆకర్షణగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హాజరై ఈవెంట్‌ను విజయవంతం చేయగా... సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ హాజరై అభిమానులను అలరించారు. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ తనదైన శైలిలో కొద్దిసేపు ప్రసంగించి ముగించేశాడు.

ఎక్కడా కనబడని బన్నీ
సైరా ప్రమోషన్స్‌లో బన్నీ ఎక్కడా కనబడకపోయే సరికి దూరంగా ఉంటున్నాడేమోనని వార్తలు వినిపించాయి. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కైనా వస్తాడని అభిమానులంతా ఆశగా ఎదురుచూశారు. కానీ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతోనే ఈవెంట్‌కు హాజరు కాలేకపోయాడని తెలుస్తోంది. తాజాగా సైరాపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.

తండ్రికి కొడుకు ఇచ్చిన గిఫ్ట్..
మగధీర సినిమా చూసినప్పటి నుంచీ.. చిరంజీవి గారిని అలాంటి చారిత్రాత్మక చిత్రంలో చూడాలనుకున్నాను. ఇన్నాళ్లకు నా కల నిజమైంది. ఓ తండ్రికి కొడుకు ఇవ్వగల బహుమతి ఇది. ఇలాంటి చిత్రాన్ని చిరంజీవి గారితో తీసినందుకు నిర్మాత, నా ప్రియ సోదరుడు రామ్‌చరణ్‌కు ధన్యవాదాలు, కంగ్రాట్స్. చిత్రానికి పనిచేసిన ప్రతీ ఒక్కరికి ఆల్‌దిబెస్ట్. డైరెక్టర్ సురేందర్ రెడ్డికి నా స్పెషల్ రెస్పక్ట్. ఈ మూవీ ఎప్పటికీ మరిచిపోలేని మ్యాజిక్ క్రియేట్ చేయాలని, గుండెల్లో ప్రతి నిత్యం సైరా అంటూ ధ్వనించేలా చేయాలని కోరుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సైరా
ఎన్నో హంగులతో తెరకెక్కిన సైరాను దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో భారీ ఎత్తున నిర్మించారు. ఈ మూవీలో బిగ్‌బీ అమితాబ్, కిచ్చా సుదీప్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, జగపతి బాబు, లేడీ సూపర్‌స్టార్ నయనతార, మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన ఈ మూవీ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సైరా బుకింగ్స్‌లో దూసుకుపోతోంది.