Don't Miss!
- News
JEE Main 2023 admit card విడుదల: ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- Sports
INDvsNZ : రాంచీలో టీమిండియా లాస్ట్ ఆడిన టీ20.. ఆ మ్యాచ్ ఫలితం ఏంటి?
- Lifestyle
Trans fat foods: ఈ విషాహారాలు తినడం వల్ల 5 బిలియన్ల మందికి గుండె జబ్బులు వస్తున్నాయి..జాగ్రత్త!
- Automobiles
బెంగళూరులో కనిపించిన కొత్త వెహికల్: ఇలాంటి వెహికల్ మీకెప్పుడైనా కనిపించిందా..
- Finance
Ticket Refund: విమాన ప్రయాణికులకు ఊరట.. DGCA తాజా నియమాల ప్రకారం..
- Technology
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
ఎన్టీఆర్ తో విబేధాలు.. అప్పట్లో ఒకేసారి 10 సినిమాలు ఎందుకంటే: తారకరత్న
నందమూరి కుటుంబంలో కొన్ని విభేదాలు ఉన్నాయని గత కొంత కాలంగా అనేక రకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ను ఆ ఫ్యామిలీ మొదటి నుంచి కూడా దూరం పెడుతోంది అనేది కేవలం కొందరు మాత్రమే ఎన్టీఆర్ క్లోజ్ గా ఉంటారు అని చెబుతూ ఉంటారు. తారకరత్న తో అతనికి విభేదాలు ఉన్నాయని ఎన్టీఆర్కు పోటీగానే అప్పట్లో ఒకేసారి పది సినిమాలకు సంతకం చేయించినట్లుగా కూడా చెప్పు కుంటూ ఉంటారు. అయితే ఆ కథనాలపై రీసెంట్గల్బగా తారకరత్న ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మొదట దూరం పెట్టి..
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రహీరోలలో ఒకరిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా నందమూరి ఫ్యామిలీ నుంచి అత్యధిక మార్కెట్ ఉన్న హీరోగా కూడా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ ఉన్నాడు. అయితే ఎన్టీఆర్ ను మొదట కాస్త దూరంగానే పెట్టిన నందమూరి వాళ్ళు హీరోగా తను మంచి గుర్తింపును అందుకున్న తర్వాత దగ్గరికి తీసుకున్నట్లుగా ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది.

పోటీగా తారకరత్న
అయితే మొదట్లో స్టూడెంట్ నెంబర్ వన్, ఆది సక్సెస్ అనంతరం జూనియర్ ఎన్టీఆర్ ఎదుగుదలను చూసి నందమూరి ఫ్యామిలీలో కొందరు తట్టుకోలేక అతనికి పోటీగా తారకరత్నను ఇండస్ట్రీకి పరిచయం చేసినట్లు ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో అనుకుంటూ ఉంటారు. అప్పట్లో తారకరత్న చేత నందమూరి బాలకృష్ణ ఒకేసారి పది సినిమాలకు పైగా సంతకం చేయించారు అని నందమూరి తర్వాత జనరేషన్ లో అతను అగ్ర హీరోగా నిలబడాలని కూడా ప్రణాళికలు రచించినట్లు కూడా రూమర్స్ వస్తూ ఉంటాయి.

ఒకేసారి 10 సినిమాలు
ఇక ఫైనల్ గా మొదటి సారి తారకరత్న ఆ విషయాలన్నిటిపై కూడా తనదైన శైలిలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఒక విధంగా తాను ఒకేసారి అన్ని సినిమాలు ఒప్పుకోవడం నిజమే కావచ్చు కానీ ఎన్టీఆర్ కు పోటీగా మాత్రం నేను ఇండస్ట్రీ లోకి రాలేదు అని తెలియజేశాడు. ఎందుకంటే నటుడిగా నేను కూడా స్థిరపడాలని ఎప్పటినుంచి అనుకున్నాను. అప్పుడు అలా అవకాశాలు రావడంతోనే అలా ఒకేసారి అన్ని సినిమాలు కమిట్మెంట్స్ ఇవ్వాల్సి వచ్చింది అని అన్నారు.

ఎన్టీఆర్ తో విబేధాలు
అయితే జూనియర్ ఎన్టీఆర్ తో విభేదాలు ఉన్నట్లు కూడా ఇండస్ట్రీలో టాక్ ఉంది అని.. ఆ విషయంపై ఏ విధంగా వివరణ ఇస్తారు అని ఒక ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు కూడా తారకరత్న చాలా సున్నితంగా వివరణ ఇచ్చాడు. ఎన్టీఆర్ తో రిలేషన్ అనేది ఒక బ్రదర్ తరహా లోనే ఉంటుంది ఎప్పుడూ కూడా అతన్ని ఫ్యామిలీని దూరం పెట్టలేదని చాలా అన్యోన్యంగా నే ఉన్నాము అని తారకరత్న వివరణ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్పెషల్ బాండింగ్..
అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటన విషయంలో మాత్రం నెంబర్ వన్ అని అతను చాలా కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు అని తారకరత్న వివరణ ఇచ్చారు. అయితే అందరూ అనుకుంటున్నట్లు గా తారకరత్న తో అలాగే నందమూరి కుటుంబ సభ్యులతో కూడా ఇటీవల మళ్లీ గ్యాప్ వచ్చింది అని వస్తున్నా వార్తలపై కూడా అతను స్పందించాడు. అందులో కూడా నిజం లేదని నందమూరి ఫ్యామిలీ అనేది ఒక ప్రత్యేకమైన బాండింగ్ తో ఉంటుంది అని అందరూ కలిసినప్పుడు చాలా హ్యాపీగా మాట్లాడుకుంటారని కూడా ఈ నటుడు తెలియజేశాడు.