సింగిల్ సెల్ఫీతో సంచలనం రేపిన దళపతి విజయ్.. సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు
దళపతి విజయ్ తన సినిమాల రికార్డులతోనే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ ట్వీట్లతో సంచలన రేపుతూ అభిమానుల్లో సంతోషాన్ని నింపారు. 2020లో నిరాశలో ఉన్న అభిమానులకు తన ట్వీట్లతో ఉత్తేజాన్ని కలిగించాడు. ఆయన నటించిన చిత్రం మాస్టర్ ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. అయితే మాస్టర్ మూవీ షూటింగ్ సందర్భంగా తన వేలాది అభిమానులతో కలిసి తీసుకొన్న సెల్పీతో సంచలనం రేపారు.
థ్యాంక్యూ నైవేలి అంటూ మాస్టర్ షూటింగుకు తరలి వచ్చిన విజయ్ సెల్ఫీ తీసుకొని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఆ ట్వీట్‌కు అభిమానులు స్పందించి రీట్వీట్లతో మోత మోగించారు. విజయ్ ట్వీట్‌ను దాదాపు 145000 సార్లు రీ ట్వీట్ చేయడంతో 2020లో అత్యధికంగా రీట్వీట్ అయిన ట్వీట్‌గా రికార్డును సొంతం చేసుకొన్నది.

ఇక ఆ సమయంలోనే విజయ్ నివాసాలపై ఐటీ దాడులు చేయడంతో తాను ఎలాంటి బెదిరింపులకు లొంగేది లేదని సంకేతాలు ఇస్తూ విజయ్ తన అభిమానులతో ఉత్సాహం కలిసి సెల్ఫీని పోస్టు చేయడం మరింత క్రేజ్‌ను పెంచుకొన్నారు. ఐటీ దాడులు జరిగిన తర్వాత అధికారులతో అన్ని రకాలుగా సహకరించి నైవేలీ షూటింగు రావడం జరిగింది.


Click it and Unblock the Notifications











