Adith Arun పేరు మార్చుకొన్న టాలీవుడ్ యంగ్ హీరో.. కొత్త పేరేంటో తెలుసా?

సినిమా పరిశ్రమలో సెంటిమెంట్లకు, జాతకాలకు, న్యూమరాలజీకి ప్రాధాన్యత చాలా ఎక్కువ. ముహుర్తాలు, సినిమా టైటిల్స్, హీరోల పేర్లు విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటారనే విషయం గురించి కొత్తగా చెప్పనక్లర్లేదు. గతంలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు, నటులు తమ పేర్లను మార్చుకొని భారీ సక్సెస్‌లు అందుకొన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా ఆ కోవలోకి యువ హీరో అదిత్ అరుణ్ చేరారు. తన పేరును మార్చుకొని అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్దమయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే..

యువ హీరో అదిత్ అరుణ్‌లో ప్రతిభకు కొదవ లేదనే విషయం ఆయన చిత్రాలు నిరూపించాయి. అయితే ఆయన టాలెంట్‌ను పోల్చి చూసుకొంటే సక్సెస్‌లు ఆయన ఖాతాలో పడలేదనే విషయాన్ని సినీ వర్గాలు చెబుతాయి. తుంగభద్ర, పీఎస్ వీ గరుడ వేగ, డియర్ మేఘ, WWW లాంటి చిత్రాలు ప్రేక్షకులనే కాకుండా సినీ విమర్శకులను మెప్పించాయి.
అయితే భారీ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అదిత్ అరుణ్ తాజాగా తన పేరును త్రిగుణ్‌గా మార్చుకొన్నట్టు అధికారికంగా ప్రకటించారు.

Tollywood hero Adith Arun changed his name as Thrigun

అదిత్ అరుణ్ తాజాగా ట్వీట్ చేస్తూ.. It's the New me Yours #Thrigun అంటూ తెలిపారు. ఇకపై తనను మీడియా మిత్రులు, చిత్ర పరిశ్రమలోని స్నేహితులు, పెద్దలు త్రిగుణ్ పేరుతో పిలవండి అని కోరారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న కొండా చిత్రంలో నటించారు. ఈ సినిమా తన కెరీర్‌లో డిఫరెంట్ ఫిల్మ్ అవుతుందని త్రిగుణ్ తెలిపారు. కొండా ట్రైలర్ విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో త్రిగుణ్‌గా అదిత్ అరుణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X