#BoycottLaalSinghChaddha శివలింగానికి పాలతో అర్చన శుద్ద దండగ.. అమీర్ వ్యాఖ్యలపై భగ్గుమన్న నెటిజన్లు

బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ మరోసారి వివాదాల్లో చిక్కుకొన్నారు. గతంలో అమీర్ చేసిన వ్యాఖ్యలను పోస్టు చేస్తూ ఆయన నటించిన తాజా చిత్రం లాల్‌సింగ్ చద్దాను బహిష్కరించాలని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అమీర్ ఖాన్‌తో పాటు కరీనా కపూర్‌ను, వారిద్దరు నటించిన సినిమాను భారీగా ట్రోల్ చేస్తూ #BoycottLaalSinghChaddha, #Boycottbollywood అనే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. తాజా వివాదం వెనుక అసలు కారణం ఏమిటంటే?

శివలింగానికి పాలతో అర్చనా?

శివలింగానికి పాలతో అర్చనా?

అమీర్ ఖాన్ గతంలో సత్యమేవ జయతే అనే ఓ షోకు హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ షోలో హిందువుల మనోభావాలను రెచ్చగొట్టే విధంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శివలింగాలకు క్షీరాభిషేకం చేయడం శుద్ద దండగ. 20 రూపాయలు పెట్టి పాలు విగ్రహంపై పోయడానికి బదులు.. పేద పిల్లలకు కడుపు నింపే పనిచేయాలి అమీర్ ఖాన్ వ్యాఖ్యలు చేశారు.

లాల్ సింగ్ చద్దా ట్రైలర్‌పై ట్రోల్స్

లాల్ సింగ్ చద్దా ట్రైలర్‌పై ట్రోల్స్

అయితే అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ చిత్రం హాలీవుడ్‌లో టామ్ హాంక్స్ నటించిన ఫారెస్ట్ గంప్ చిత్రానికి రీమేక్. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత భారీగా అమీర్ ఖాన్‌పై ట్రోల్స్ చేయడం మొదలైంది. ఫారెస్ట్ గంప్ సినిమాను కాపీ, పేస్ట్ చేశారంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.

మిస్టర్ ఫర్‌ఫెక్ట్ కాదు.. కాపీ మాస్టర్ అంటూ

మిస్టర్ ఫర్‌ఫెక్ట్ కాదు.. కాపీ మాస్టర్ అంటూ

అమీర్ ఖాన్ హాలీవుడ్ సినిమాలను కాపీ కొట్టే మాస్టర్.. ఆయన మిస్టర్ ఫర్‌ఫెక్ట్ కాదు. ధూమ్ 3 చిత్రం ప్రిస్టేజ్ అనే సినిమాను కాపీ చేశారు. గజని మూవీ మెమొంటో, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రం పైరేట్స్ ఆఫ్ కరేబియన్, లాల్ సింగ్ చద్దా సినిమా ఫారెస్ట్ గంప్ సినిమా రీమేక్. అమీర్ ఖాన్ మిస్టర్ ఫర్‌ఫెక్టా అంటూ ట్రోల్ చేస్తున్నారు.

టికెట్ కోసం 200 రూపాయలు ఖర్చు చేయకండి

టికెట్ కోసం 200 రూపాయలు ఖర్చు చేయకండి

శివలింగానికి పాలతో అర్చన చేయడం శుద్ద దండగ అంటూ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం తెరపైకి తెచ్చి అమీర్ ఖాన్‌ను టార్గెట్ చేశారు. 200 రూపాయలు పెట్టి సినిమా చూసే బదులు.. ఆ మొత్తాన్ని పేదలకు, అనాథ పిల్లల కోసం ఖర్చు చేయండి అంటూ నెటిజన్లు సలహా ఇస్తూ ట్రోల్ చేస్తున్నారు.

లాలా సింగ్ చద్దా బహిష్కరించండి

గతంలో కరీనా కపూర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కూడా నెటిజన్లు భగ్గుమంటున్నారు. మా సినిమాలు చూడకండి. మా సినిమాలను చూడాలని మేము ఎవరిని బలవంతం చేయడం లేదు అని కరీనా కపూర్ చేసిన కామెంట్లను పోస్టు చేస్తూ.. లాలా సింగ్ చద్దా సినిమాను బహిష్కరించండి. ఆ సినిమా టికెట్ డబ్బుతో పేద పిల్లల ఆహారం కోసం ఖర్చు చేయండి అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

బాలీవుడ్ హీరోలంటే ఇదే మరీ అంటూ

దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్ మహాదిక్ భార్య స్పందిస్తూ... నా ఇద్దరి పిల్లల్ని కూడా దేశ సైన్యంలో చేర్పిస్తానని అంటే.. అమీర్ ఖాన్ భార్య మాత్రం మా ఫిల్లల సేఫ్టీ కోసం దేశం విడిచి వెళ్తానని అంటున్నారు. ఇది మన సినిమా హీరోలకు దేశం గురించి ఉన్న అభిప్రాయం అంటూ నెటిజన్లు దుయ్యబడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X