twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మీరు ఏమైనా రాసుకోండి, పవన్ కళ్యాణ్ నా దేవుడు’

    |

    Recommended Video

    Miss Match Movie Press Meet | Aishwarya Rajesh | Uday Shankar | Filmibeat Telugu

    'ఆటగదరా శివ' చిత్రంతో హీరోగా పరిచయమైన ఉదయ్ శంకర్ తొలి సినిమాలో నటన పరంగా మంచి పేరు తెచ్చుకున్నారు. త్వరలోనే ఈ యువ హీరో 'మిస్ మ్యాచ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ 'అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

    ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తుండగా ఎన్ వి. నిర్మల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. భూపతి రాజా కథ అందించారు. జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మాతలు. మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో హీరో ఉదయ్ శంకర్ సినిమా గురించి వివరించారు.

    ఆడియన్స్‌లోకి వెళ్లే మంచి కథ

    ఆడియన్స్‌లోకి వెళ్లే మంచి కథ

    నా ఫస్ట్ మూవీ ‘ఆటగదరా శివ' విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సెకండ్ మూవీ ఆడియన్స్‌లోకి వెళ్లేలా మంచి కథ కోసం ఎదురు చూస్తుండగా భూపతి రాజా చెప్పిన కథ నచ్చింది. చాలా మంచి స్క్రిప్టు... ఈ స్క్రిప్టును ప్రజంట్ చేయాలంటే దమ్మున్న డైరెక్టర్ కావాలి. ఆ సమయంలో నిర్మల్ సర్ ఈ కథ చేయడానికి ఒప్పుకున్నారు.

    సెట్స్‌లో అందరినీ వణికించేస్తారు

    సెట్స్‌లో అందరినీ వణికించేస్తారు

    నిర్మల్ సర్ వెరీ వెరీ వైబ్రెంట్ డైరెక్టర్.. ఇక్కడ ఇంత కూల్‌గా ఉన్నారు కానీ సెట్స్ లో అందరినీ వణికించేస్తారు. గణేష్ చంద్రగారు సినిమాటోగ్రఫీ చాలా బావుటుంది. నిర్మల్ సర్ మైండ్లో ఉన్న విజువల్ ఎగ్జాక్ట్‌గా తెరపై ప్రజంట్ చేశారు. ఐశ్వర్య రాజేష్ చాలా బిజీగా ఉంటూ టైట్ షెడ్యూల్‌లో కూడా ఆమె ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

    పవన్ కళ్యాణ్ నా దేవుడు

    పవన్ కళ్యాణ్ నా దేవుడు

    నా ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మీరు ఏమైనా రాసుకోండి ఆయన నాకు దేవుడు, గురువు. ఆయన్ను సూర్తిగా తీసుకుని నేను సినిమాల్లోకి వచ్చాను. పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో నా ఫేవరెట్ మూవీ ‘తొలిప్రేమ'. ఈ సినిమా నుంచి ‘నా మనసే' సాంగ్ ‘మిస్ మ్యాచ్' మూవీలో రీమిక్స్ చేశాం.

    సింగిల్ షాట్లో ఆ సాంగ్ తీశాం

    సింగిల్ షాట్లో ఆ సాంగ్ తీశాం

    ‘తొలి ప్రేమ' మూవీలోని పెద్ద హిట్ సాంగ్‌ రీమిక్స్ చేసి ప్రేక్షకులను మెప్పించగలమా? అనే సమయంలో విజయ్ మాస్టర్ కొత్త ఐడియాతో వచ్చారు. సింగిల్ షాట్లో తీద్దామన్నారు. ఏదైనా తేడా కొడితే ఫ్యాన్స్ నుంచి విమర్శలు వస్తాయని మేము భయపడ్డాం. కానీ జాగ్రత్తగా తీద్దామని చెప్పి మూడు రోజులు రిహార్సల్స్ చేసి తీశాం. 4 నిమిషాలు ఎక్కడా షాట్ బ్రేక్ అవ్వకుండా తీశాం. అద్భుతంగా వచ్చింది. ఆ సాంగ్ సినిమాలో అందరినీ ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాం... అని ఉదయ్ శంకర్ చెప్పుకొచ్చారు.

    English summary
    Uday Shankar Emotional Speech About Pawan Kalyan at Miss match movie press meet. The movie directed by Nirmal, starring Udayshankar, Aishwarya Rajesh, Roopa Lakshmi, NV Nirmal Kumar, Bhupathi Raja, G.Sriram Raju, Bharat Ram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X