పాత్ర కోసం ఫ్యామిలీ ప్యాక్.. యంగ్ హీరో న్యూ లుక్.. వైరలవుతోన్న పిక్

పాత్రల డిమాండ్ మేరకు ఎంతటి సాహాసాన్నైనా చేయడానికి ముందుకు వస్తారు కొందరు నటులు. పాత్ర కోసం తమ శరీరాన్ని శిల్పాన్ని చెక్కినట్టుగా మలిచేసుకుంటారు. బలహీనంగానైనా, బలంగానైనా మలుచుకునేందుకు వెనకాడరు. అలాంటి వారిలో ముందుండే హీరోలు ఆమిర్ ఖాన్, విక్రమ్. దంగల్ సినిమా కోసం సిక్స్ ప్యాక్, ఫ్యామిలీ ప్యాక్ ట్రై చేశాడు ఆమిర్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఐ సినిమా కోసం విక్రమ్ ఒళ్లు హూనం చేసుకున్నాడు విక్రమ్. ఇలా అతి కొద్ది మంది హీరోలు పాత్రలు డిమాండ్ చేస్తే ఎంతకైనా తెగిస్తారు. తాజాగా వీరి జాబితాలోకి ఓ యంగ్ హీరో వచ్చేశాడు.

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే..

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే..

ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జనతా గ్యారెజ్ సినిమాలో ఆయనకు తమ్ముడిగా నటించిన ఉన్ని ముకుందన్.. తాజాగా ఓ పాత్ర కోసం ఫ్యామిలీ ప్యాక్‌ను పెంచాడు. ఈ యంగ్ హీరో అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన భాగమతి చిత్రంలోనూ నటించాడు. ఈ రెండు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తాజాగా ఓ చారిత్రాతక నేపథ్యమున్న సినిమాతోనూ పలకరించాడు.

మామాంగం సినిమాతో..

మామాంగం సినిమాతో..

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా వచ్చిన మామాంగం సినిమాలో ఓ పవర్ ఫుల్ పాత్రలో నటించాడు ఉన్ని ముకుందన్. ఈ చిత్రంలోని తన పాత్ర కోసం సిక్స్ ప్యాక్ పెంచాడు. ఈ సినిమాలోని చంద్రోట్ పానికర్ పాత్రలోకి రావడానికి తానెంత కష్టపడ్డాడో.. వివరిస్తూ తన తదుపరి చిత్రం కోసం ఇంకెంత కష్టపడ్డాడో వివరిస్తూ ఓ పోస్ట్ చేశాడు.

ఆ పాత్రలోకి రావడానికి 11 నెలల సమయం..

చంద్రోట్ పానికర్ పాత్రలోకి రావడానికి శారీరకంగా మరియు మానసికంగా నాకు 11 నెలలు పట్టింది. చంద్రోట్‌ను ఆదరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అయితే ఆ పాత్ర ముగిసింది. మరో కొత్త పాత్రలోకి ప్రవేశిస్తున్నాను. చంద్రోట్ పాత్ర కోసం పెంచిన బాడీని తగ్గించేందుకు నాలుగు నెలల సమయం పట్టింది. ఇప్పుడు నా కొత్త చిత్రానికి సన్నద్దమవుతున్నాను.

యాక్షన్ సన్నివేశాలుండవు..

యాక్షన్ సన్నివేశాలుండవు..

ఇప్పుడు జయకృష్ణన్ అనే పాత్రలోకి ప్రవేశించబోతోన్నాను. నా తదుపరి చిత్రం మేప్పాడియన్ . ఆ పాత్రను పోషించడానికి ఈ రూపంలోకి మారడం ఎంతో అవసరం. మీరు సినిమాను చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. నా ప్రతి విజయాల వెనుక మీరు మద్దతుగా నిల్చున్నారు. మీ ప్రతి ఒక్కరికీ నేను రుణపడి ఉంటాను. నా ఇతర చిత్రాల మాదిరిగా ‘మేప్పాడియన్'లో యాక్షన్ సన్నివేశాలు లేవు. కుటుంబ ప్రేక్షకులను మరియు యువతను మెప్పించే కొన్ని మంచి సన్నివేశాలతో రూపొందుతున్న చిత్రమిద'ని తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X