Don't Miss!
- News
ఫిబ్రవరి 7.. `రాజధాని అమరావతి`కి బిగ్ డే..!!
- Lifestyle
ఎరుపు రంగు హ్యాండ్లూమ్ చీరలో నిర్మలా సీతారామన్, శక్తిని, ధైర్యానికి సంకేతంగా..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Technology
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Unstoppable 2 Glimpse: ప్రభాస్ కు భయపడి బాలయ్య వెనకాల గోపిచంద్.. అల్లరే అల్లరి!
అన్ స్టాపబుల్ సీజన్ 2 తదుపరి ఎపిసోడ్ పై అంచనాలు మరింత ఎక్కువవుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అలాగే మ్యాచో స్టార్ గోపీచంద్ ఇద్దరు కలిసి మొదటిసారి ఒక టాక్ షోలో పాల్గొనబోతున్నారు. అది కూడా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఉన్నటువంటి షోలో వీరిద్దరూ రావడం విశేషం. ఒక విధంగా వీరి ఎపిసోడ్ మాత్రం పూనకాలు తెప్పిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు గోపీచంద్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఫ్యాన్ మూమెంట్స్
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఇందులో ఫ్యాన్ మూమెంట్స్ తో పాటు మంచి సరదా సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు అనిపిస్తోంది. ఈ అన్ స్టాపబుల్ షో ఎందుకు అంత ప్రత్యేకమో ఇప్పుడు ఈ ప్రోమోలను చూస్తేనే అర్థమవుతుంది. ప్రభాస్ గోపిచంద్ ఫుల్ ఎపిసోడ్ రావడానికి ఇంకా టైం ఉంది. అయితే ఆహా మాత్రం సోషల్ మీడియాలో ప్రోమోలను విడుదల చేస్తూ మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఇదివరకే ప్రభాస్ గ్లింప్స్ విడుదల చేయగా ఇప్పుడు గోపీచంద్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది.

సీక్రెట్స్ చెప్పిన గోపిచంద్
ప్రోమోలో ప్రభాస్ గోపీచంద్ పేరు మీద షూట్ చేయగానే అతను ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇక గోపీచంద్ రాగానే బాలయ్యను కౌగిలించుకొని ఆప్యాయంగా పలకరించాడు. ఇక ప్రభాస్ తో కూడా సరదాగా మాట్లాడిన గోపీచంద్ కొన్ని సీక్రెట్స్ కూడా బయటపెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక బ్యాగ్రౌండ్ లో వచ్చిన పక్క కమర్షియల్ సాంగ్ కూడా అతని ఎంట్రీకి కరెక్ట్ గా సెట్ అయింది.

రేయ్.. అంటూ
ఇక వీరి మధ్యలో సంభాషణల మధ్య అలకలు అలాగే పంచ్ లు కూడా పడినట్లు అనిపిస్తోంది. బాలకృష్ణ ఏదో అడగడంతో 2008 కాదు సార్ అని గోపీచంద్ ఆలోచిస్తూ చెప్పాడు. ఇక పక్కనే ఉన్న ప్రభాస్ రేయ్.. అంటూ కొంత డిఫరెంట్ గా మాట్లాడడం మంచి ఎంటర్టైన్మెంట్ ను కలిగించింది. సరదాగా ఇద్దరు స్నేహితులు ఎలా ఉంటారో వీరు కూడా అలానే ఉన్నారు అనిపించింది.

బాలయ్య వెనకాల గోపిచంద్
ఇక గోపీచంద్ మళ్ళీ ఏదో కామెంట్ చేసినట్లు ఉన్నాడు. ఇక ప్రభాస్ అతనిపై సరదాగా కొట్టడానికి రెడీ కాగా బాలయ్య బాబు వెనకాల దాక్కుని ఉండిపోయాడు. ఇక బాలయ్య కూడా అతనికి ప్రొటెక్షన్ ఇచ్చాడు. ఇక దాన్ని చూసి వాళ్ళ ప్రభాస్ ఐతే చాలా నవ్వేశాడు. ఇందులో ప్రభాస్ గోపీచంద్ మధ్యలో డైలాగ్స్ వార్ కూడా నలిచినట్లుగా అనిపిస్తోంది.
|
అది ఒంగొలియన్స్ అంటే..
ఇక చివరగా అయితే బాలయ్య అది ఒంగొలియన్స్ అంటే అని పవర్ ఫుల్ గా కామెంట్ చేశాడు. అంటే గోపీచంద్ సొంత ప్రాంతం ఒంగోలు కావడంతో అతని గొప్పతనం గురించి పొగిడినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ గ్లింప్స్ మాత్రం ఎపిసోడ్ పై మరింత అంచనాలు పెంచాయి. ప్రోమో కూడా రావాల్సి ఉంది.
ఇక తప్పకుండా ఫుల్ ఎపిసోడ్ హై రేంజ్ లో ఉంటుంది అనిపిస్తుంది. ఇక క్రిస్మస్ సందర్భంగా ఈ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫ్యాన్స్ అయితే చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఫుల్ ఎపిసోడ్లో ఇంకా ఇలాంటి సరదా సన్నివేశాలు ఉంటాయో చూడాలి.