Varun tej సినిమాకు 24కోట్ల ఆఫర్... మరోవైపు బాలీవుడ్ ఎంట్రీ
టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువ హైట్ తో ఉన్న వరుణ్ తేజ్ ఫిట్నెస్ లో కూడా అదే తరహాలో మెయింటైన్ చేస్తున్నాడు. ఈ మధ్య గని సినిమా కోసం అతను పూర్తిగా న్యూ లుక్ లోకి మారిపోయాడు. ఆ ఎత్తుకు బాహుబలి లాంటి బాడీ తోడైతే ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ప్రస్తుతం వరుణ్ అదే తరహాలో ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఇక ఇటీవల వరుణ్ సినిమాకు ఒక సాలీడ్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ ఎంట్రీకి కూడా ప్లాన్ సెట్టయినట్లు సమాచారం.

వరుణ్ తేజ్.. కాస్త భిన్నంగా..
మెగా హీరోల్లో అందరూ మాస్ జనాలను ఆకట్టుకునే విధంగా వెళుతుంటే వరుణ్ తేజ్ మాత్రం అందుకు కాస్త భిన్నంగా వెళుతున్నాడు. తొలిప్రేమ, ఫిదా అంటూ ప్రేమ కథలతోనే బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు. అలాగే గద్దల కొండ గణేష్ సినిమాతో మాస్ జనాలను కూడా ఎట్రాక్ట్ చేస్తున్నాడు.

బాక్సింగ్ నేపథ్యంలో..
ఇక రానున్న రోజుల్లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గని సినిమా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా బాక్సర్ పాత్రలో నటిస్తున్న వరుణ్ స్పెషల్ గా కోచింగ్ కోసం విదేశాలకు కూడా వెళ్ళాడు. ఆ సినిమాను అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబి నిర్మిస్తున్నాడు.

ఆహా.. 24కోట్ల ఆఫర్
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గని సినిమాలో స్టార్ క్యాస్ట్ కూడా గట్టిగానే ఉంది. ఉపేంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి వంటి స్టార్స్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన ఓటీటీ శాటిలైట్ హక్కులను ఆహా 24కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. శాటిలైట్ హక్కులను ఆహా మరో ఛానెల్ కు అమ్మనుంది.
Recommended Video

బాలీవుడ్ ఎంట్రీ..
ఇక మరోవైపు వరుణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీకి ప్లాన్స్ సెట్టయినట్లు తెలుస్తోంది. సోని పిక్చర్స్ లో చేయబోయే సినిమా కోసం ఒక టాలెంటెడ్ దర్శకుడు వరుణ్ వరుణ్ తేజ్ ను ఫిక్స్ చేసుకున్నాడట. ఆ సినిమాను తెలుగు హిందీలో ఒకేసారి తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. మరి వరుణ్ తేజ్ మొదటి బాలీవుడ్ సినిమాతో ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











