twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గని టీమ్ కు షాక్.. ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

    |

    ప్రస్తుతానికి తెలుగు సినీ పరిశ్రమ నుంచి విడుదలైన RRR సినిమా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున కలెక్షన్లు సాధించడానికి కారణం సినిమాకు పెంచిన టికెట్ రేట్లు అని చెప్పవచ్చు. ఒకరకంగా సినిమా టికెట్ రేట్లు భారీగా ఉన్నాయని ఆ మధ్య పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే రాబోతున్న వరుణ్ తేజ్ గని సినిమా విషయంలో ఇలాంటి పొరపాటు జరగకుండా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే

    బాక్సర్ పాత్రలో కనిపిస్తూ

    బాక్సర్ పాత్రలో కనిపిస్తూ

    మెగా బ్రదర్ నాగబాబు కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన వరుణ్ తేజ్ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. చాలా డీసెంట్ సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్న వరుణ్ తేజ్ తాజాగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక బాక్సర్ పాత్రలో కనిపిస్తూ ఉండగా ఆయన తల్లిగా నదియా కనిపించనున్నారు.

    కీలకమైన పాత్ర ధారులుగా

    కీలకమైన పాత్ర ధారులుగా

    ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ సాయి మంజ్రేకర్ నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక నవీన్ చంద్ర జగపతి బాబు కూడా ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన పాత్ర ధారులుగా ఉండబోతున్నారు. ఈ సినిమా నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది.

    సినిమా ప్రమోషన్స్ చేస్తూ

    సినిమా ప్రమోషన్స్ చేస్తూ

    సినిమా విడుదల చేయాలి అనుకున్నప్పుడు RRR లాంటి పెద్ద సినిమాలు అడ్డుపడడంతో ఈ సినిమా ఎట్టకేలకు ఈనెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది. ఈ సినిమాను సిద్దు ముద్ద, అల్లు బాబి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండటంతో యూనిట్ సినిమా ప్రమోషన్స్ చేస్తూ సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచే ప్లాన్ చేస్తోంది.

    టికెట్ ధరలు తగ్గించడం

    టికెట్ ధరలు తగ్గించడం

    అయితే ఈ సినిమా యూనిట్ కి అనూహ్యంగా ఒక రకమైన షాక్ తగిలిందని చెప్పవచ్చు. అయితే అది యూనిట్ కి షాక్ కాగా సామాన్య ప్రేక్షకులు మాత్రం గుడ్ న్యూస్ అని చెప్పాలి. RRR ఇలాంటి సినిమాకు ఎంత రేటు పెట్టినా చూస్తారు కానీ గని లాంటి సినిమా విషయంలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలి అంటే టికెట్ ధరలు తగ్గించడం సరైన మార్గం అని భావిస్తున్నారు.

    ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టి

    ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టి

    ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గని సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్లకు వేరువేరుగా టికెట్ రేట్లు పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా టికెట్ రేట్స్ తగ్గించారని అంటున్నారు. మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లో ₹200 + జీఎస్టీ, సింగిల్ స్క్రీన్స్ లో జీఎస్టీతో కలిపి ₹ 150 గా టికెట్ రేట్స్ డిసైడ్ చేశారు.

    English summary
    Varun Tej Ghani movie Ticket rates to be decreased In Telangana.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X