For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Veera Simha Reddy trailer review అలాంటి డైలాగ్స్‌తో జగన్ సర్కార్‌పై సెటైర్.. బాలయ్య అమీతుమీ!

  |

  నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్‌గా మారాయి. ఈ సినిమాపై బజ్ హై రేంజ్‌‌లో క్రియేట్ అయింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఘనంగా నిర్వహిస్తున్నారు. కనివినీ ఎరుగని రీతిలో జరుగుతున్న ఈ వేడుకలో బాలకృష్ణ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ ట్రైలర్‌లో బాలకృష్ణ ఎనర్జీ, వైఎస్ జగన్ ప్రభుత్వం మీద చేసిన పరోక్ష విమర్శల తీరు ఎలా ఉన్నాయంటే..

  ఏ ఒక్కడు కత్తి పట్టకూడదని

  ఏ ఒక్కడు కత్తి పట్టకూడదని


  సీమలో ఏ ఒక్కడు కత్తి పట్టకూడదని నేనే కత్తిపట్టాను. పదవి కోసమో.. పరపతి కోసమో కాదు.. ముందు తరాలు పెట్టిన బాధ్యత. నాది ఫ్యాక్షన్ కాదు. సీమ మీద ఎఫెక్షన్. పుట్టింది పులిచర్ల.. పెరిగింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్ అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్‌తో అదరగొట్టారు.

  బాలయ్య మాటల సునామీ

  బాలయ్య మాటల సునామీ


  వీరసింహారెడ్డి ట్రైలర్‌లో హూ ఆర్ యూ అని ఓ వ్యక్తి అంటే.. పది నిమిషాలు ఏ పబ్ వద్ద కెళ్లైనా నిలచో.. అక్కడ నీకు స్లోగన్ వినిపిస్తుంది అని అనగానే.. జై బాలయ్య అంటూ డైలాగ్ వినిపించింది. దాంతో అది నా స్టామినా అంటూ బాలయ్య మాటల వర్షం కురిపించాడు. అపాయింట్‌మెంట్ లేకుండా వస్తే.. అకేషన్ చూడను.. ఒకేషన్ చూడను. ఒంటిచేత్తో ఊచకోత.. కోస్తా నా కొడుకా అంటూ యాక్షన్ సీన్లలో ఇరుగదీశాడు.

   పవర్‌ఫుల్‌గా వరలక్ష్మీ శరత్ కుమార్

  పవర్‌ఫుల్‌గా వరలక్ష్మీ శరత్ కుమార్


  ఇక వీర సింహరెడ్డి ట్రైలర్‌లో వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రకు కూడా ఆకట్టుకొనేలా ఉంది. పక్కోడు పంపుతున్న పసుపు కుంకుమలతో బతుకుతుంటే.. ముత్తైదువలా లేను.. ముండమోపిలా ఉన్నాను అంటూ వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో తెలియజెప్పింది. శృతిహాసన్‌తో స్టెప్పులు, పాటలు ఓ రేంజ్‌లో ఉన్నాయని చెప్పవచ్చు.

   ఏపీ సర్కార్‌పై డైరెక్ట్ ఎటాక్

  ఏపీ సర్కార్‌పై డైరెక్ట్ ఎటాక్


  సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు. మార్చలేరు అంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై పరోక్షంగా బాలయ్య సెటైర్లు వేశారు. ఇటీవల ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్చిన వివాదాన్ని ఉద్దేశంగా చేసుకొని ఈ డైలాగ్స్ పెట్టి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. పదవి చూసుకొని నీకు పొగరేమో.. కానీ బై బర్త్ నా డిఎన్‌ఏకు పొగరెక్కువ అంటూ ట్రైలర్‌ను ముగించారు.

  జగన్ సర్కార్‌పై సెటైర్లతో


  ఇప్పటికే వీరసింహారెడ్డి టీజర్, ట్రైలర్లలో ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు వేసే డైలాగ్స్ వినిపించాయి. ఇప్పటికే భోసిడికే లాంటి పదాలు, ఇప్పుడు బోర్డులపై పేర్లు మార్చడం అంశాలతో బాలయ్య ప్రభుత్వానికి సవాల్ విసిరినట్టు కనిపిస్తుంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మార్పు, ఇతర అంశాలు సినీ, రాజకీయ వర్గాల్లో కాక పుట్టించాయి. తాజా ట్రైలర్‌లో వాడిన పదాలపై ప్రభుత్వ వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే.

  English summary
  Nandamuri Balakrishna's Veera Simha Reddy trailer is out with High Expectations. Here is the trailer glimpse.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X