Don't Miss!
- News
ఆ ఒక్కటి... అంటే చంద్రబాబుకు మమ'కారం'!!
- Finance
Adani Cement: మూతపడ్డ అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలు..! అయోమయంలో 20 వేల కుటుంబాలు..
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Lifestyle
చలికాలంలో అల్లం తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి, ఎందుకో తెలుసా?
- Sports
Team India : టీమిండియా ముందున్న అతి పెద్ద సమస్య.. వరల్డ్ కప్ గెవాలంటే సమస్య తీరాల్సిందే!
- Automobiles
భారత్‌లో Aura ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన హ్యుందాయ్: ధర & వివరాలు
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Venky75: డిఫరెంట్ పాత్రలో వెంకటేష్.. క్రేజీగా వెంకీ75 అప్డేట్.. హిట్ 4 సినిమా?
టాలీవుడ్ స్టార్ హీరోలలో దగ్గుబాటి విక్టరీ వెంకటేష్ ఒకరు. ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో నటించిన ఆయన ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తన నటనతో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు.
వెంకటేష్ అంటే ఇష్టపడని ఏ హీరో అభిమాని ఉండనంతంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల కాలంలో ఆయన వయసుకు తగిన పాత్రలు చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. అయితే వెంకటేష్ సోలో హీరోగా నటించిన సినిమా వచ్చి చాలా కాలం అయింది. ఇటీవల ఓరి దేవుడా సినిమాలో గెస్ట్ రోల్ చేసిన ఆయన 75వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

మొదటి సినిమా తర్వాత..
మిగతా హీరోల లాగా సినీ ఇండస్ట్రీలోకి ఇష్టంగా అడుగుపెట్టలేదు దగ్గుబాటి వెంకటేష్. ఆయన తండ్రి రామా నాయుడు కోరిక మేరకు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. 1986 సంవత్సరంలో కళియుగ పాండవులు సినిమాతో హీరోగా డెబ్యూ చేసిన వెంకటేష్ ఆ తర్వాతి కాలంలో విక్టరీ వెంకటేష్ గా పేరు తెచ్చుకున్నాడు. వెంకటేష్ చేసిన మొదటి సినిమా కళియుగ పాండవులు సూపర్ హిట్ కాగా తర్వాత చేసిన 3 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.

ప్రయోగాత్మక చిత్రాల్లో..
'కళియుగ పాండవులు' తర్వాత వెంకటేష్ చేసిన మూడు నాలుగు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినప్పటికీ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు వెంకటేష్. అవి సూపర్ హిట్ కావడంతో.. విక్టరీనే ఇంటి పేరులా మార్చుకున్నారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో హవాను చూపిస్తూ సత్తా చాటారు. కెరీర్ ఆరంభంలో ఎలివేషన్ ఉన్న సినిమాల్లో నటించిన వెంకటేష్.. తర్వాత ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాడు. అదే సమయంలో క్లాసిక్ చిత్రాలనూ చేశారు.

7 సార్లు నంది అవార్డు..
కుటుంబ కథా చిత్రాల్లోనూ నటించి ఫ్యామిలీ హీరోగానూ పేరు తెచ్చుకున్నారు వి. ఇవన్నీ వెంకటేష్ క్రేజ్‌ను బాగా పెంచేశాయని చెప్పుకోవచ్చు. విక్టరీ వెంకటేష్ సినిమాల్లో ప్రవేశించి 35 ఏళ్లు దాటాయి. ఆయన కెరీర్‌లో 7 సార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డ్స్, 5 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకుని ఎన్నో రికార్డులు కూడా సాధించాడు. అంతేకాకుండా వెంకటేష్ తెలుగులో మల్టీస్టారర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.

మల్టీ స్టారర్ హీరోగా..
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', పవన్‌తో 'గోపాల గోపాల', రామ్‌తో 'మసాలా', వరుణ్ తేజ్‌తో 'F2' అండ్ 'F3', నాగ చైతన్యతో 'వెంకీ మామ' చిత్రాల్లో నటించారు. ఇలా మరో స్టార్ హీరో కూడా చేయని విధంగా మల్టీస్టారర్ చిత్రాలు చేసిన ఘనత అందుకున్నాడు. అయితే ఈ మధ్య ఆయన నుంచి సోలో సినిమా ఏది రాలేదు. 2017లో గురు సినిమా రాగా తర్వాత రీమేక్ చిత్రాలు దృశ్యం, దృశ్యం 2 మాత్రమే వచ్చాయి.

వెంకీ75 సినిమాకు సంబంధించి..
ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత సోలో సినిమాతో సరికొత్తగా ఎంటర్టైన్ చేయనున్నారు వెంకటేష్. హిట్, హిట్ 2 చిత్రాలతో సక్సెస్ ట్రాక్ లో ఉన్న శైలేష్ కొలనుతో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా హిట్ 4 అని ఇప్పటికే వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా Venky75 సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా హిట్ 4 అని కొందరు అంటుంటే.. మరికొందరు హిట్ 4 కాకుండా డిఫరెంట్ మూవీ అని చర్చించుకుంటున్నారు.
డిఫరెంట్ పవర్ ఫుల్ రోల్..
వెంకీ 75 చిత్రంగా రానున్న ఈ సినిమాకు సంబంధించిన వివరాలను జనవరి 25న ప్రకటించనున్నట్లు ఈ పోస్టర్ ద్వారా తెలిపారు. ఇక ఈ పోస్టర్ లో వెంకటేష్ చేతిలో గన్ లా కనిపిస్తున్న ఏదో ఒక వస్తువు ఉంది. అది తుపాకీ అయితే కాదు. ఈ సినిమాకు శ్యామ్ సింగరాయ్ సినిమా నిర్మించిన నిహారిక ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మాతగా వ్యవహరించనున్నారు. మరి ఇది హిట్ 4 సినిమానో కాదో ముందు తెలియాల్సి ఉంది. అయితే వెంకటేష్ ఇప్పటివరకు ఎప్పుడు చేయనటువంటి ఒక డిఫరెంట్, పవర్ ఫుల్ రోల్ ను ఈ 75వ సినిమాలో చేయనున్నారని మేకర్స్ చెబుతున్నారు.