»   » తప్పు సరిదిద్దుకొంటా.. నా యాటిట్యూడ్ మారదు.. నోటా ఫ్లాఫ్‌పై రౌడీ ఎమోషనల్

తప్పు సరిదిద్దుకొంటా.. నా యాటిట్యూడ్ మారదు.. నోటా ఫ్లాఫ్‌పై రౌడీ ఎమోషనల్

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Vijay Devarakonda Talks On Nota Bad Talk

  టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' చిత్రానికి తెలుగులో నెగిటివ్ టాక్‌తో పాటు యావరేజ్ రివ్యూలు వచ్చిన సంగతి తెలిసిందే. అభిమానులు సైతం ఈ సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రౌడీ హీరో స్పందించారు. విమర్శులు ఎందుకు వచ్చాయో స్టడీ చేస్తానని, ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరిద్దుకుంటానని స్పష్టం చేశారు.

  విజయ్ దేవరకొండ 'నోటా' సినిమా ద్వారా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అతడు నటించిన 'అర్జున్ రెడ్డి', 'గీతా గోవిందం' భారీ విజయం సాధించడంతో 'నోటా'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 5న విడుదలైన ఈచిత్రం ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

   రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను

  రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను

  నా కోసం ‘నోటా' సినిమా చూడటానికి వెళ్లిన వారికి.... ఈ సినిమా చూసి అసంతృప్తికి గురైన వారికి, సంతృప్తికి గురైన వారికి నేను ఒకటే చెబుతున్నాను. నేను ఇక్కడ సాకులు చెప్పాలనుకోవడం లేదు. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనుకుంటున్నాను. ‘నోటా' సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. ఈ సినిమా ద్వారా మేము చెప్పాలనుకున్న స్టోరీ చెప్పాము, అందుకు తగిన పెర్ఫార్మెన్స్ ఇచ్చాము అని విజయ్ తెలిపారు.

  నా సినిమాను ఇష్టపడిన వారి ప్రేమను స్వీకరిస్తా

  నా సినిమాను ఇష్టపడిన వారి ప్రేమను స్వీకరిస్తా

  తమిళనాడు, నేషనల్ మీడియాతో పాటు నా సినిమాను ఇష్టపడిన వారి ప్రేమను స్వీకరిస్తున్నారు. వారికి నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని మెప్పించే చిత్రాలు మరిన్ని చేస్తాను అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.

  విమర్శలను సీరియస్‌‌గా తీసుకుంటా

  విమర్శలను సీరియస్‌‌గా తీసుకుంటా

  ఎవరికైతే ‘నోటా' సినిమా నచ్చలేదో? ఎవరైతే విమర్శలు చేశారో.... వాటిని సీరియస్‌గా తీసుకుంటాను. ఎందుకు ఇలా జరిగిందనే విషయం స్టడీ చేస్తాను. నా వైపు ఏమైనా తప్పులు ఉంటే సరిద్దుకుంటాను అని విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు.

  నా యాటిట్యూడ్ అయితే మారదు

  నా యాటిట్యూడ్ అయితే మారదు

  ‘నోటా'పై అసంతృప్తిగా ఉన్న వారిని మెప్పించడానికి మరింత కష్టపడతాను. అయితే నా యాటిట్యూడ్ అయితే మారదు. విజయాలు, అపజయాలు రౌడీని మార్చలేవు. దాన్ని ఆపితే మనం ముందుకు సాగలేం. రౌడీ అనేది కేవలం విజయం కోసం కాదు, రౌడీ అనేది పోరాడే తత్వం... అని విజయ్ వ్యాఖ్యానించారు.

  గెలిస్తే గెలుస్తాం లేదా నేర్చుకుంటాం

  గెలిస్తే గెలుస్తాం లేదా నేర్చుకుంటాం


  రౌడీ యాటిట్యూడ్ మనలో బర్న్ అవుతున్నందుకు గర్వంగా ఉంది. పోరాడుతూ ముందుకు సాగుదాం. గెలుస్తే గెలుస్తాం... లేదంటే నేర్చుకుంటామని అభిమానులకు విజయ్ పిలుపునిచ్చారు.

  నేను 17న వస్తున్నా, ఈ లోపే పండగ చేస్కోండి

  నేను 17న వస్తున్నా, ఈ లోపే పండగ చేస్కోండి


  ఎవరైతే ‘నోటా' పరిస్థితి చూసి సెలబ్రేట్ చేసుకుంటున్నారో... ఇప్పుడే పండగ చేస్కోండి. ఎందుకంటే నేను 17న తిరిగి వస్తున్నాను అంటూ విజయ్ వ్యాఖ్యానించారు.

  English summary
  "To everyone who goes to the cinema for me And to all who hope others fail and celebrate it ._• I will not make excuses, I take responsibility, I am proud of NOTA. It's a story I wanted to tell, a character explored and a performance delivered. Tamil Nadu, the national media and all the audience who loved it here, your love has been received. All the disappointment and criticism is taken seriously, it will be studied, the miscalculation on my side corrected, decisions evaluated and work put in but the attitude will not change. A success or failure isn't what makes or breaks a Rowdy. The day you stop, give in, give up, that's when you stop being one. And being Rowdy isn't about just winning, it's fighting for that win, it's an attitude that burns inside us, so be proud rowdies, keep fighting. Gelusthe Gelustamm Leda Nerchukuntamm. For those who are celebrating this, ippude pandaga cheskondi 17 I will be back." Vijay Deverakonda.tweeted.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more