Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి.. కొత్త సినిమాను ప్రారంభించిన విశాల్
హీరో విశాల్ ఎంత ఫాస్ట్‌గా ఉన్నాడో మాటల్లో చెప్పలేం. ఓ సినిమా షూటింగ్ నడుస్తుండగానే మరో ప్రాజెక్ట్‌కు కొబ్బరి కాయ కొట్టేస్తున్నాడు. అలా ఇప్పుడు విశాల్ చేతిలో రెండు మూడు ప్రాజెక్ట్‌లు ఒకే సారి నడుస్తున్నాయి. ఇప్పటికే విశాల్ తుప్పరివాలన్ 2 (డిటెక్టివ్ సీక్వెల్)ను డైరెక్ట్ చేసే పనిలో పడ్డాడు. మరో వైపు చక్ర అనే చిత్రంలో నటిస్తున్నాడు. అవి రెండూ కాకుండా ఈ మధ్యే ఆర్యతో కలిసి ఓ సినిమా పట్టాలెక్కించాడు.
వాడు వీడు తరువాత ఆర్య విశాల్ కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి ఎనిమీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అక్టోబర్ నవంబర్ నెలలో హైద్రాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలోనే షూటింగ్ జరిగింది. లాంగ్ షెడ్యూల్‌ను సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకుని విశాల్ కాస్త రెస్ట్ తీసుకున్నాడు. తాజాగా ఈ గ్యాప్‌లోనే మరో చిత్రాన్ని కూడా రెడీ చేసేశాడు. తాజాగా విశాల్ తన కొత్త సినిమా అప్డేట్‌ను ప్రకటించాడు.

షార్ట్ ఫిలిం డైరెక్టర్ అయిన శరవణన్‌ను దర్శకుడిగా విశాల్ పరిచయం చేయబోతోన్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తోన్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు నేడు ప్రారంభమయ్యాయి. తాజాగా ఈ ఫోటోలు బయటకు రావడంతో అందరూ విశాల్ స్పీడును చూసి అందరూ షాక్ అవుతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన విషయాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.