అందుకే విశ్వంభర రిలీజ్ ఆలస్యం.. రూమర్లపై మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం విశ్వంభర. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వీ వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో త్రిషా కృష్ణ్, అషికా రంగనాథ్, ఇషా చావ్లా, సురభి పురానిక్, కునాల్ కపూర్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి మౌనీ రాయ్ స్పెషల్ సాంగ్‌లో స్పెప్పులేయబోతున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్‌పై సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లకు చెక్ పెట్టడానికి చిరంజీవి స్వయంగా ఓ విడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియోలో చిరంజీవి చెప్పిన విషయాలు ఏమిటంటే?

ఇలా మీ ముందుకు రావడానికి కారణం విశ్వంభర. ఈ సినిమా ఎందుకు ఆలస్యం అవుతుందని అందరికి ఓ సందేహం ఉంది. ఈ ఆలస్యం, జాప్యం సముచితమని నేను భావిస్తున్నాను. ఈ సినిమా సెకండాఫ్ వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్‌పై ఆధారపడి ఉంది. మీకు అత్యున్నత ప్రమాణాలతోటి, బెస్ట్ క్వాలిటీతోని మీ ముందు ఉంచాలి. మీకు అందివ్వాలనే దర్శక, నిర్మాత ప్రయత్నమే ఈ జాప్యానికి ప్రధాన కారణం. ఎలాంటి విమర్శలకు శ్రద్దాసక్తులతో తీసుకొంటున్న సముచితమైన సమయం ఇది అని చిరంజీవి అన్నారు.

Why Vishwambhara delayed

ఇక విశ్వంభర సినిమా గురించి చెప్పాలంటే.. చందమామ కథలా సాగిపోయే అద్భుతమైన సినిమా కథ ఇది. చిన్న పిల్లలక మరీ ముఖ్యంగా పెద్ద వారిలో ఉండే చిన్న పిల్లలుంటారే.. వారిని సైతం అలరించే విధంగా, వినోదపరుస్తుంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని నాతోపాటు ఎదురు చూసే అభిమానుల కోసం యూవీ క్రియేషన్స్ వారు నా పుట్టిన రోజు ఆగస్టు 22వ తేదీ కానుకగా ఆగస్టు 21వ తేదీ 6 గంటల 6 నిమిషాలకు చిన్న గ్లింప్స్‌ను అందివ్వబోతున్నారు అని చిరంజీవి పేర్కొన్నారు.

ఇక ఈ సినిమా గురించి చిరు లీక్ ఇస్తాను అంటూ.. ఈ మూవీ విడుదల ఎప్పడంటే? చిన్న పిల్లలు, చిన్న పిల్లల మాదిరిగా ఉండే పెద్దలు ఎంజాయ్ చేసే సమయం వేసవి. 2026 వేసవిలో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాను ఎంజాయ్ చేయండి. విశ్వంభరను ఆస్వాదించండి అంటూ చిరంజీవి తనదైన శైలిలో విశ్వంభర విడుదల జాప్యానికి కారణం చెప్పి అభిమానులను సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు.

ఇక సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందుతున్న విశ్వంభర సినిమాకు వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి చోటా కే నాయుడు సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ కోటగరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి, ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను సుమారుగా 200 కోట్ల రూపాయల వ్యయంతో భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌ 2026 లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

More from Filmibeat

Read more about: vishwambhara chiranjeevi trisha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X