Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఈసారి గట్టిగా కొట్టాలని అల్లు శిరీష్ వర్కౌట్స్.. న్యూ లుక్ వైరల్!
టాలీవుడ్ యువ హీరోల్లో ప్రస్తుతం సక్సెస్ కోసం తీవ్రంగా కష్టపడుతున్న వారిలో అల్లు శిరీష్ కూడా ఉన్నాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా అతనికి సరైన సక్సెస్ దక్కడం లేదు. ఎంతో అనుభవం ఉన్న అల్లు అరవింద్ రిస్క్ చేసి కొన్నిసార్లు కొడుకుకోసం లెక్కకు మించిన బడ్జెట్ కూడా పెట్టాడు. ఆ మధ్య వచ్చిన శ్రీరస్తూ శుభమస్తు తప్పితే మరొక సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు.
కథల సెలక్షన్ లో కూడా శిరీష్ కాస్త బిన్నంగానే ఆడుగులు వేస్తున్నాడు. విఐ.ఆనంద్ దర్శకత్వంలో చేసిన ఒక్క క్షణం సినిమా విడుదలకు ముందు కాస్త బజ్ క్రియేట్ చేసినప్పటికీ ఆ తరువాత బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ను అందుకుంది. ఇక నెక్స్ట్ ఒక రొమాంటిక్ సినిమాతో ఎలాగైనా హిట్ టాక్ ను అందుకోవాలని శిరీష్ ఫిట్నెస్ విషయంలో భారీగా మార్పులు చేస్తున్నాడు. ఇటీవల ఒక వర్కౌట్ వీడియో రిలీజ్ చేయగా అందులో నెవర్ బిఫోర్ అనేలా కండలు పెంచినట్లు తెలుస్తోంది.
I am yet to reach my fitness goals. "Training Day", is a short video series where I take along with me through my journey. Tag along! #AStrainingday #backworkout pic.twitter.com/wsmtjJoplP
— Allu Sirish (@AlluSirish) June 22, 2021

అల్లు శిరీష్ ప్రస్తుతం ఒక రొమాంటిక్ సినిమాలో నటిస్తున్నాడు. రాకేష్ శశి దర్శకత్వంలో 'ప్రేమ కాదంట' అనే టైటిల్ తో తేటకెక్కిస్తున్న ఆ సినిమాలో అను అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని అల్లు శిరీష్ ఎంతో నమ్మకంతో కష్టపడుతున్నాడు. మరి ఆ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. రాకేష్ శశి ఇంతకుముంది కళ్యాణ్ దేవ్ తో విజేత అనే సినిమా చేసిన విషయం తెలిసిందే.