For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆరో నెల.. నా జీవితానికో మలుపు.. అంటూ కియారా అద్వానీ క్రేజీ న్యూస్!

    |

    సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లకు, ఇతర నటీనటులకు సెంటిమెంట్లు చాలా ఎక్కువనేది కాదనలేని వాస్తవం. సినిమా ఆరంభాలకు, రిలీజ్, ఫస్ట్ లుక్, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు ముహుర్తం లేనిదే కాలు తీసి అడుగు బయటపెట్టారు. అయితే అందుకు తాను కూడా అతీతం, మినహాయింపు కాదని కియారా అద్వానీ వెల్లడించింది. తనకు సెంటిమెంట్‌గా నిలిచిన విషయాన్ని అభిమానులతో పంచుకొన్నారు. ఈ భామ చెప్పిన విషయానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...

     ప్రియుడితో మాల్దీవులకు

    ప్రియుడితో మాల్దీవులకు

    కియారా అద్వానీ ఇటీవల కాలంలో ప్రియుడు సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి తిరుగుతూ మీడియా హెడ్‌లైన్లను ఆకర్షిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సిద్దార్థ్‌తో మాల్దీవుల పర్యటనకు వెళ్లి వచ్చిన ఈ బ్యూటీ తాజాగా తన ప్రియుడి ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసి మీడియాను ఆకర్షించింది. ఇక ప్రస్తుతం కబీర్ సింగ్ పోస్టుతో మరోసారి మీడియాలో హైలెట్ అయింది.

    కబీర్ సింగ్‌తో మంచి గుర్తింపు

    కబీర్ సింగ్‌తో మంచి గుర్తింపు

    కియారా అద్వానీకి బాలీవుడ్‌లో అత్యంత గుర్తింపు తెచ్చిన చిత్రం కబీర్ సింగ్. తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా కియారాకు మంచి పేరు తీసుకురావడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. అయితే తనకు అత్యంత ఇష్టమైన సినిమా మైలురాయిని అధిగమించిన నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలో స్పందించింది.

    జూన్ నాకు లక్కీ నెల అంటూ

    జూన్ నాకు లక్కీ నెల అంటూ

    కబీర్ సింగ్ రిలీజై జూన్ 21వ తేదీకి రెండేళ్లు పూర్తి చేసుకొన్నది. ఈ సందర్భంగా కియారా తన ఆనందాన్ని, ఆ సినిమాతో ముడిపడి ఉన్న మధురానుభూతులను పంచుకొన్నారు. జూన్ నాకు లక్కీనెల. క్యాలెండర్‌లో ఆరో నెల అంటే నాకు బాగా కలిసి వస్తుంది. కబీర్ సింగ్ రిలీజ్ అయి రెండేళ్లు పూర్తి చేసుకొన్నది. ఈ చిత్రం నా జీవితాన్ని మార్చేసింది అంటూ కియారా ఇన్స్‌టాలో పోస్టు పెట్టారు.

     సందీప్ రెడ్డి వంగ స్పందిస్తూ..

    సందీప్ రెడ్డి వంగ స్పందిస్తూ..

    ఇక కబీర్ సింగ్ రెండేళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా సందీప్ రెడ్డి వంగ స్పందిస్తూ.. మనస్పుతో నేను.. హృదయంతో మీరు.. ప్రేమను జోడించడం ఓ మధురానుభూతి. కబీర్ సింగ్‌కు రెండేళ్లు అంటూ పోస్టు పెట్టారు. ఇక హీరో షాహిద్ కపూర్ కూడా కబీర్ సింగ్ సినిమాకు సంబంధించిన విషయాలను పోస్టు చేశారు. ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకొంటే ఎన్నో గుర్తులు, మెమొరీస్ అంటూ షాహీద్ తన పోస్టులో పేర్కొన్నారు.

    Tollywood లో Anirudh Ravichander హవా, అదొక్కటే ఛాలెంజ్..| NTR 30 || Filmibeat Telugu
     బాలీవుడ్, టాలీవుడ్‌లో కియారా అద్వానీ కెరీర్

    బాలీవుడ్, టాలీవుడ్‌లో కియారా అద్వానీ కెరీర్

    ఇక కియారా అద్వానీ విషయానికి వస్తే.. భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ బాలీవుడ్ భామ.. ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అలాగే కార్తీక్ ఆర్యన్‌తో భూల్ భులయ్యా 2, వరుణ్ ధావన్, అనిల్ కపూర్, నీతూ కపూర్‌తో కలిసి జగ్ జగ్ జీయో అనే చిత్రంలో నటిస్తున్నారు. అంతేకాకుండా శశాంక్ ఖైతాన్ రూపొందించే చిత్రానికి కియారా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

    English summary
    Kiara Advani happy about 2 years of Kabir Singh. She wrote in Twitter that, Its 2 years of preeti sikka🥺 Ki as preeti is such a precious one🤧❤ Congrats to my girl💕 advani_kiara. #2YearsOfKabirSingh #KiaraAdvani
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X