5 గురు హీరోయిన్లతో యశ్ రొమాన్స్ .. కియారా, నయనతారతోపాటు ఆ ముగ్గురు ఎవరంటే?
కేజీఎఫ్ చిత్రంతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశారు కన్నడ స్టార్ట్ యష్. 2018లో కేజీఎఫ్ చాప్టర్ 1, 2022లో కేజిఎఫ్ చాప్టర్ 2 తో ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రశాంత్ నేను దర్శకత్వంలో వచ్చిన ఈ రెండు చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కూడా సంచలనంగా వసూళ్లను సాధించాయి. అంతకుముందు యష్ కన్నడ చిత్ర పరిశ్రమలో చాలా సినిమాలోనే నటించారు. హీరోగా ఆయా సినిమాలతో గుర్తింపు దక్కించుకున్నప్పటికీ కేజీఎఫ్ సిరీస్ లతో భారతదేశంలో అగ్ర హీరోగా మారిపోయారు.
కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత కన్నడ స్టార్ యష్ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రాలేదు. కానీ భారీ బడ్జెట్ ఫిలిం టాక్సిక్ అనే చిత్రాన్ని ప్రకటించారు. ఇక మూడేళ్లుగా ఈ సినిమా నిర్మాణ దశలోనే ఉంది. కేజీఎఫ్ తో సంచలనం సృష్టించిన కన్నడ స్టార్ యష్ తన రాబోయే చిత్రం టాక్సిక్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. 3 ఏళ్లుగా యష్ నెక్ట్స్ చిత్రం కోసం అభిమానులు, ప్రేక్షకులకు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఆ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు ఫిలిం సర్కిల్ లో చెక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

కన్నడ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ చిత్రంలో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో ఇండియాలోనే టాప్ హీరోయిన్లు లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ యంగ్ అండ్ క్రేజీ హీరోయిన్ కియారా అద్వానీ, బాలీవుడ్ మరో బ్యూటిఫుల్ హీరోయిన్ తార సుతారియా, మరో బాలీవుడ్ నటి హుమ ఖురేషితో పాటు గా టాలీవుడ్ టాప్ హీరోయిన్ శృతిహాసన్ కూడా ఈ చిత్రంతో నటించబోతుందని తెలుస్తోంది. శృతి హాసన్ మినహా మిగితా హీరోయిన్లు కన్ఫమ్ అయ్యారు. ఇలా ఏకంగా 5 గురు హీరోయిన్లు టాక్సిక్ చిత్రంలో నటిస్తుండటం ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తిని నెలకొల్పింది.
ఇక ఈ చిత్రానికి మహిళా డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. మాస్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ లో వెంకట్ కే. నారాయణ నిర్మాతగా ఈ భారీ చిత్రం రూపుదిద్దుకుంటోంది. భారీ తారాగణం, భారీ ప్రొడక్షన్, టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్న కారణంగా సినిమాకు భారీ బడ్జెట్ అవుతోందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. రూ.200 కోట్ల బడ్జెట్ తో సినిమా రూపుదిద్దుకుంటుండటం విశేషం.
కాగా, సినిమాకు రాజీవ్ రవి సినిమాటోగ్రఫీగా వ్యవహరిస్తున్నారు. కన్నడలో రూపుదిద్దుకుంటోంది. పార్లల్ గా ఇంగ్లీష్ లోనూ చిత్రీకరణ జరుగుతుండటం విశేషం. ఇక ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ గా రిలీజ్ చేయబోతున్నారు. కాగా 2026 మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. మరోవైపు యష్ బాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న రామాయణ : పార్ట్ 1, రామాయణ : పార్ట్ 2 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. రామాయణ పార్ట్ :1 చిత్రంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications











