Actress Nusrat Jahan: భర్తకు గుడ్‌బై.. ఆ విషయంలో ఐ డోంట్ కేర్.. గ్లామరస్ ఎంపీ సెన్సేషనల్ కామెంట్

పశ్చిమ బెంగాల్‌లో గ్లామర్ హీరోయిన్‌గా రాణించిన నుస్రత్ జహాన్ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. వెండి తెరపైనే కాకుండా రాజకీయ ముఖచిత్రంపై కూడా ఆమె తన అందచందాలు, సమాజ సేవతో ఆకట్టుకొన్నారు. అయితే రెండు సంవత్సరాల క్రితం ఓ వ్యాపారవేత్తను మతాంతర వివాహం చేసుకొని సంచలనం సృష్టించారు. అయితే తాజాగా భర్తకు గుడ్‌బై చెప్పినట్టు వెల్లడించిన మరో సంచలనానికి తెర తీశారు. ఆ వివరాల్లోకి వెళితే...

బీచ్‌లో బాడీని మొత్తం చూపిస్తూ రెచ్చిపోయిన సుగణ్య సుబ్రమణియన్

చిన్న వయసులోనే ఎంపీగా

చిన్న వయసులోనే ఎంపీగా

2011లో శోత్రూ మూవీతో బెంగాల్‌ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నుస్రత్ జహాన్ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పిలుపు మేరకు బసిర్హత్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపికైన ఆమె పార్లమెంట్‌లో మోస్ట్ గ్లామరస్ ఎంపీగా ఘనతను సొంతం చేసుకొన్నారు.

క్లోవెజ్ షోతో కుర్రాళ్ళ మతి పోగొడుతున్న సోనమ్ కపూర్

వ్యాపారవేత్తతో మతాంతర వివాహం..

వ్యాపారవేత్తతో మతాంతర వివాహం..

ఎంపీగా, నటిగా కొనసాగుతూనే వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌తో ప్రేమలో పడ్డారు. ఎవరూ ఊహించని విధంగా వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌ను 2019లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా టర్కీలో మతాంతర వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత తన వివాహాన్ని బహిర్గతం చేసి భారీ విందును ఏర్పాటు చేయగా పలువురు రాజకీయ వేత్తలు, పారిశ్రామిక వేత్తలతోపాటు మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు.

షామా సికందర్.. కెమెరా ముందు ఘాటైన అందాల విందు

మేమిద్దరం విడిపోయాం అంటూ

మేమిద్దరం విడిపోయాం అంటూ

అయితే అనూహ్యంగా బుధవారం (జూన్ 9వ తేదీన ) భర్తతో విడిపోయినట్టు షాకింగ్ విషయాన్ని నుస్రత్ జహాన్ బయటపెట్టారు. చాలా రోజుల క్రితమే మేమిద్దరం విడిపోయాం. నా వ్యక్తిగత విషయం కావడంతో గోప్యంగా ఉంచాను. ఎవరికీ వెల్లడించలేదు అని బసిర్హత్ ఎంపీ, బెంగాల్ హీరోయిన్ నుస్రత్ జహాన్ వెల్లడించారు.

ట్రెడిషనల్ లుక్కుతోనే బోల్డ్ గా దర్శనమిచ్చిన సందీపా ధర్

మా పెళ్లికి చట్టబద్దత లేదంటూ..

మా పెళ్లికి చట్టబద్దత లేదంటూ..

నా పెళ్లి, విడాకులకు సంబంధించి చట్టబద్దత లేదు. నా విడాకుల గురించి ఎవరికీ ప్రశ్నించే హక్కు లేదు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రెండు మతాల మధ్య జరిగే పెళ్లికి చట్టబద్దత ఉంటుంది. మా పెళ్లి విషయంలో అలాంటి చట్టబద్దత లేదు. కాబట్టి మా పెళ్లి విషయంలో ఎలాంటి చట్ట, న్యాయపరమైన అడ్డంకులు, ప్రశ్నలు లేవనెత్తే అవకాశం లేదు అంటూ నుస్రత్ క్లారిటీ ఇచ్చారు.

నుస్రత్ జహాన్ సినీ కెరీర్ ఇలా..

నుస్రత్ జహాన్ సినీ కెరీర్ ఇలా..

నుస్రత్ జహాన్ సినీ కెరీర్ విషయానికి వస్తే.. 2011లో శోత్రూ చిత్రం ద్వారా బెంగాల్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఖిలాడీ, జమై 420, క్రిస్ క్రాస్, నాఖాబ్, అసుర్, ఎస్ఓఎస్ కోల్‌కతా లాంటి చిత్రాల్లో నటించారు. 2021లో డిక్షనరీ, స్వస్తిక్ సంకేత్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X