పెళ్లి గురించి అంజలి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అందుకు బాధలేదు, ఎవరూ లాక్కోలేరు కదా!
తెలుగు అమ్మాయి అంజలి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రాజోలుకి చెందిన ఈ భామ సినిమాల మీద ఆసక్తితో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే తెలుగులో అవకాశాలు తగ్గడంతో తమిళ్ లో కి వెళ్లి అక్కడ హీరో జై తో ప్రేమాయణం సాగించి చర్చనీయాంశంగా మారింది. అయితే పెళ్లి గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే

తెలుగులో ఎంట్రీ ఇచ్చి
ఫోటో అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అంజలి తర్వాత ప్రేమలేఖ రాశా, అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. అయితే ఈ రెండు సినిమాలు హిట్ కాకపోవడంతో ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. దీంతో తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలలో ఆమె తన లక్ పరీక్షించుకుంది. తమిళంలో దాదాపు 10 సినిమాలు చేసిన తర్వాత మళ్లీ తెలుగులో మహేష్ బాబు, వెంకటేష్ హీరోలుగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

సీత పాత్రలో
ఆ తర్వాత తెలుగులో బలుపు, గీతాంజలి, శంకరాభరణం, డిక్టేటర్, చిత్రాంగద, నిశ్శబ్దం ఇలాంటి సినిమాల్లో నటించింది. ఎన్ని సినిమాల్లో నటించినా ఆమె కెరీర్ లో తెలుగులో హిట్ అనగానే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా గుర్తొస్తుంది.. సీత అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఆమె నటించి ప్రేక్షకుల అందరి మన్ననలు పొందింది. అయితే తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి గురించి అలాగే సినిమాల్లో అవకాశాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

కొత్త హీరోయిన్ల ఎంట్రీతో
కొత్త హీరోయిన్ల ఎంట్రీతో పాత హీరోయిన్ లకు కాస్త అవకాశాలు తగ్గిన మాట వాస్తవమే కాగా ఈ విషయంలో ఆమె మాట్లాడుతూ తనకు ఆఫర్స్ రాలేదని ఎప్పుడూ బాధపడలేదు అని చెప్పుకొచ్చింది. అందరికీ ఒకేలా ఆఫర్స్ వస్తాయని అనుకోవడం కరెక్ట్ కాదని కొత్త వారు రావడం వల్ల తనకు ఆఫర్స్ తగ్గుతున్నాయని అనడంలో నిజం లేదని చెప్పుకొచ్చింది

ఎవరూ అలా లాక్కోరు
ఇతర హీరోయిన్స్ వల్ల తనకు ఆఫర్స్ తగ్గలేదని చెప్పుకొచ్చిన అంజలి కొత్తవారు వచ్చినా పాత వారికి అవకాశాలు తగ్గుతాయి అనడం సరికాదని పేర్కొంది. ఒక పాత్రకి ఎవరు సూట్ అవుతారో వారినే వెతుక్కుంటూ మేకర్స్ అవకాశం ఇస్తారని చెప్పుకొచ్చింది. ఒకరి అవకాశాలు మరొకరు లాక్కుంటారు అనే విషయాన్ని తాను నమ్మనని ఆమె చెప్పుకొచ్చింది.

పెళ్లి
అంతేకాక లాక్ డౌన్ సమయంలో చాలామంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితం మొదలు పెడుతున్న నేపథ్యంలో అంజలి కూడా పెళ్లి చేసుకుంటుందా అని ప్రశ్నిస్తే అదేమీ లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది. ఈ మధ్యనే వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఈ భామ నా పూర్తి ఫోకస్ నా కెరీర్ మీదే ఉందని ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచన లేదని చెప్పుకొచ్చింది. అయితే ఆ సినిమా సూపర్ హిట్ అయినా సరే ఈమెకు పెద్దగా అవకాశాలు మాత్రం రావడం లేదని అంటున్నారు.
Recommended Video

సినిమాల విషయానికి వస్తే
ఇక మా ఆమె నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆమె హీరోయిన్ గా నటించిన ఆనందభైరవి తెలుగులో రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్ 3 సినిమాలో కూడా నటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలు కాక తమిళంలో ఒక సినిమా కన్నడంలో ఒక సినిమాలో కూడా అంజలి నటిస్తున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











