ఆఫర్లు లేక కష్టాల్లో దంగల్ హీరోయిన్.. అందరి మాదిరిగానే నిరుద్యోగిగా మారా అంటూ ఆవేదన!
కరోనావైరస్ కారణంగా సినిమా పరిశ్రమ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. వేతన కార్మికులు, రోజువారీ సినీ కూలీల జీవితాలు అగమ్య గోచరంగా మారాయి. అంతేకాకుండా ఓ రేంజ్ యాక్టర్ల పరిస్థితి కూడా కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్ ఆసక్తికరమైన, ఎమోషనల్ కామెంట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

చాచి 450తో బాలనటిగా
కశ్మీర్‌కు చెందిన ఫాతిమా సనా షేక్ బాలనటిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. చాచి 420 చిత్రం ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత అమీర్ ఖాన్‌తో కలిసి 2016లో దంగల్ మూవీతో పాపులారిటీని సంపాదించుకొన్నది. దంగల్ చిత్రంతో మంచి అవకాశాలు తలుపు తట్టినా.. ఆమె ఫేట్‌ను మార్చలేకపోయాయి.

దంగల్ తర్వాత హిట్లు లేక
దంగల్ మూవీ తర్వాత థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ లాంటి భారీ బడ్జెట్ చిత్రంలో ఫాతిమా సనా షేక్ నటించింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టడంతో ఆమె ఆశలు అడియాసలు అయ్యాయి. ఆ తర్వాత పాల్కిన్ ఖోలో, లూడో, సూరజ్ పే మంగల్ భరీ చిత్రాలు కూడా ఫాతిమా సనా షేక్ తన కెరీర్‌ను సరిదిద్దుకోలేకపోయింది. కరణ్ జోహార్ నిర్మించిన అజీబ్ దాస్తాన్స్ అనే చిత్రంలో నటించారు. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది.

కరోనావైరస్‌తో అవకాశాలు లేవని
కరోనావైరస్ కారణంగా సినిమా షూటింగులు ఆగిపోవడంతో చేతిలో సినిమాలు లేకుండా అయిపోయాయి. ఇప్పుడు నేను నిరుద్యోగి మారి ఇబ్బందులు పడుతున్నాను. తదుపరి ప్రాజెక్టులపై నాకు క్లారిటీ లేదు. కోవిడ్ పరిస్థితులు మెరుగుపడితే గానీ సినిమా అవకాశాలు, చేతి నిండా పని దొరుకుతుందేమో. అందరి మాదిరిగానే నాకు వర్క్ చేసే అవకాశం లభిస్తుంది అంటూ అని ఫాతిమా సనా షేక్ తెలిపింది.

బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ లాంటి వార్తలతో
కరోనా కారణంగా చాలా మంది తమ ఆప్తులను కోల్పోయారు. వారి గురించి వింటుంటే నా హృదయం తరుక్కుపోతున్నది. బాధిత కుటుంబాలకు నా సానుభూతి అని ఫాతిమా సనా షేక్ అన్నారు. అయితే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ లాంటి సంఘటనలు భయాన్ని కలిగిస్తున్నాయి. అయితే ప్రజలంతా ధైర్యంగా ఉండాలని ఆమె కోరారు.

ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి
ఇక కరోనా మహమ్మారిని ఎదురించాలంటే ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి. వ్యాక్సిన్ ద్వారానే కోవిడ్19ను అరికట్టగలం. ఇలాంటి ప్రమాదం నుంచి గట్టెక్కించేది కేవలం వ్యాక్సిన్ మాత్రమే. కాబట్టి వ్యాక్సిన్ గురించి ఆలోచించండి అంటూ ఫాతిమా సనా షేక్ ప్రజలను కోరారు.


Click it and Unblock the Notifications











