రోజుకు 12 హగ్గులు కావాలి.. టాలీవుడ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తెలుగు నటి, యాంకర్ గాయత్రీ గుప్త తెలుగు ప్రేక్షకుల్లో స్టాడబ్ తెచ్చుక లేక పోయింది. అయితే చిత్ర పరిశ్రమలోని పలు సమస్యలను లెవనెత్తుతూ ఇంటర్వ్యూల్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ ద్వారా ఆమె పేరు గట్టిగా వినిపించింది. నటీనటులు ఇబ్బందులపై తన వాయిస్ ను వినిపించింది. దీంతో కరోనా ముందే గాయత్రీ గుప్తా పేరు ప్రేక్షకుల్లో నానిపోయింది. కానీ ఆ తర్వాత గాయత్రీ గుప్తాకు సినీ అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో వీలైనప్పుడల్లా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తోంది. ఇక ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను సేఫ్ అని ఎలా ఫీల్ అవుతుందో చెప్పుకొచ్చింది.

గాయత్రీ గుప్తా మాట్లాడుతూ.. జనరల్ గా మనం సేఫ్ అని ఫీల్ అవ్వడానికి రోజుకు 8 నుంచి 12 హగ్గులు కావాలి. అవి కూడా మన కుటుంబ సభ్యుల నుంచి, ఎలాంటి దురుద్ద్యేశం లేని స్పర్శ కావాల్పి ఉంటుంది. అలా నిమిషయం నుంచి కనీసం 20 సెకండ్ల పాటైనా ఆ హగ్ ఉండాలి. నువ్వు సేఫ్ అనే ఫీలింగ్ ను ఇచ్చేలా అమ్మనో, అక్కనో, నాన్ననో, ఇంకెవ్వరి నుంచైనా ఎనిమిది నుంచి పన్నెండు హగ్గులు కావాల్సి ఉంది. అప్పుడు మన బాడీ సేఫ్ అని ఫీల్ అవుతాం. ఈ సోసైటీలో మనం సేఫ్ గా ఉన్నాం అనే ఫీలింగ్ అప్పుడు వస్తుంది.

Actress Gayathri Gupta about Hugs

మనం గతంలో చూసుకుంటే జాయింట్ ఫ్యామిలీలు ఉండేవి. అమ్మ ఒళ్లోనో, అమ్మమ్మ ఒళ్లోనో, తాత పట్టుకోవడమో జరిగేది. మనకు ఇలా ఫిజికల్ టచెస్ దొరికేవి. అందుకే అప్పుడు అందరూ ప్రశాంతంగా, ధైర్యంగా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏకంగా పరుగెడుతున్నాం. రోబోల్లాగా పరుగెడుతూనే ఉన్నాం. మనుషులు అన్నాక చిల్ అవ్వాలి. ప్రపంచంలో ఏ జంతువులపైనా తీసుకోండి, అవి ఆకలి అయినప్పుడే వేటాడుతాయి. మిగితా టైమ్ లో చిల్ అవుతాయి.' అని చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు లేకపోవడంతో సాధారణంగానే కొత్త జనరేషన్ లో ధైర్య సాహసాలు కూడా తగ్గిపోతున్నట్టుగా నిపుణులు తెలుపుతున్నారు.

ఇక ఇప్పుడు ఇదే విషయాన్ని గాయత్రీ గుప్తా తన మాటల ద్వారా తెయజేసింది. ప్రస్తుతం ఆమె మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక గాయత్రీ గుప్తా యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించి తక్కువ సమయంలోనే నటిగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. హీరోయిన్ గా సపోర్టింగ్ పాత్రల్లో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దయా, గ్యాంగ్ స్టర్స్, స్టోరీ డిస్కషన్స్ 2, అలాగే ఫిదా, కొబ్బరిమట్ట వంటి చిత్రాల్లోనటించింది.

చిత్ర పరిశ్రమలో తనకు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కున్నట్టు గత ఇంటర్వ్యూల్లో తెలిపింది. ఇక ఆమె కుటుంబం పరంగా చాలా సమస్యలు ఎదుర్కున్నానని చెప్పింది. ముఖ్యంగా తన తండ్రి రోజూ తన తల్లిని, తనను హింసించే వాడని, గొడ్డును బాదినట్టు బాదే వాడని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక చిత్ర పరిశ్రమలోనూ తొలుత అవకాశాల పేరిట చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X