ఆ టైమ్‌లో సూసైడ్ అటెంప్ట్.. వాళ్లను చంపాలనిపించింది.. హేమ ఎమోషనల్

Actress Hema: సీనియర్ నటి హేమ టాలీవుడ్‌లో తనదైన స్టైల్‌లో నటిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 250కి పైగా సినిమాల్లో నటించిన ఆమె, లేడీ కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీదేవి-వెంకటేష్ నటించిన క్షణ క్షణం చిత్రంతో తెరంగేట్రం చేసిన హేమ, బ్రహ్మానందం కాంబినేషన్‌లో చేసిన సన్నివేశాలు నేటికీ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాయి. అయితే, సినిమాలతో పాటు హేమ తరచూ వివాదాల కారణంగా కూడా మీడియాలో హైలైట్ అవుతుంటారు. తాజా ఓ ఇంటర్య్వూ లో మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదురైన కష్టాలపై స్పందించారు. 2024లో అనుభవించిన కష్టాలు తన మనసును పూర్తిగా విరిచేశాయని, ఒక దశలో చచ్చిపోవాలనిపించిందని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏం జరిగింది?

నటి హేమ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "జీవితంలో ఎవరు రెండు ప్లేస్‌లలో ఉండకూడదు అంటారు. ఒకటి హాస్పిటల్‌, రెండోది జైలు. కానీ నాకు రెండో దాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. నాకు తరచూ నోటీసులు వస్తున్నాయి. ఒంట్లో బాగోలేదు, అయినా బెంగళూరుకు ఒక్కదాన్నే వెళ్లాను. చాలా మంది 'లాయర్ తీసుకో', 'బెయిల్‌ ముందే పొందుకో' అని సలహా ఇచ్చారు. కానీ నేను ఏ తప్పు చేయలేదని నమ్మకంతో, ధైర్యంగా ఒక్కదాన్నే పోలీస్ స్టేషన్కు వెళ్లాను," అని చెప్పారు.

Actress Hema Opens Up on Arrest Fake News amp amp Depression in Emotional Interview

విచారణ సమయంలో పోలీసులు హేమను ఎన్నో ఇబ్బందికరప్రశ్నలు అడిగారు. "మీరు తాగుతారా?", "డ్రగ్స్ తీసుకున్నారా?" వంటి ప్రశ్నలతో మొదలయ్యింది. హేమ స్పష్టతగా చెప్పారు. "నాకు డ్రింక్ తాగడం అలవాటు లేదు, కానీ రెడ్‌బుల్ తాగుతాను. అందుకే ఆ విషయాన్ని ఓపెన్‌గా చెప్పాను. 'డ్రగ్స్' ప్రశ్న వచ్చినప్పుడు, నేను సమాధానం ఇచ్చాను.. అలాంటి విషయం జరగలేదు. నేను రెడ్‌బుల్ మాత్రమే తీసుకున్నాను. ఒకవేళ ఎవరో డ్రగ్స్ కలిపి ఇచ్చి ఉంటే? ఆ క్షణంలో గుండె ఆగిపోయినట్లు అనిపించింది. కానీ ధైర్యంగా నిర్భయంగా చెప్పా, అలా ఏమీ జరగలేదు." అని వివరించింది.

అసలు అరెస్ట్ అనేది ఎప్పుడూ ఊహించని సంఘటనగా హేమ చెప్పారు. "పోలీసులు టెస్టులకు తీసుకెళ్లాలనుకుని, హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ నన్ను వదిలిస్తారని భావించాను. కానీ పోలీసులు అర్థరాత్రి జడ్జి ఎదుట నిలిపేశారు. లాయర్ లేకుండా, ఎవరో తెలిసినవారు లేకుండా, అర్ధరాత్రి జడ్జి ముందు నిలబడటం నా జీవితంలో అత్యంత క్లిష్టమైన సంఘటన " అని తెలిపారు.

హేమ మీడియాపై కూడా తీవ్రంగా స్పందించారు. "మీడియా నన్ను ఇష్టం వచ్చినట్లు వాడుకుంది. నేను బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా ఫేక్ న్యూస్ పబ్లిష్ చేశారు. పెద్ద మీడియా సంస్థలు కూడా ఇలా చేశారు. అందుకే నేను నా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి సాక్ష్యాలతో బహిరంగంగా సవాల్ విసిరాను 'ఇక్కడికి రమ్మంటే ఎక్కడికైనా టెస్ట్ చేయించుకోగలను' అని." ఓపెన్ ఛాలెంజ్ వేశాను.

తనపై వచ్చిన అబద్ధ ప్రచారంతో హేమకి తీవ్ర ఆవేదన ఏర్పడిందని, ఒక దశలో చనిపోవాలనిపించిందని కూడా తెలిపారు. "ఎవరినైనా చంపేయాలనిపించిందని, లేదా చనిపోయేలా చేయాలని అనిపించిందని కూడా చెప్పగలను. కానీ ఆలోచించాను నేను చనిపోతే, వాళ్లు చెప్పినట్టు 'అవమానంతో చనిపోయింది' అంటారు. కాబట్టి నిజాన్ని మాట్లాడే ధైర్యం నా వద్ద ఉండాలి, చనిపోకూడదు అని నిర్ణయించుకున్నాను," అని హేమ చెప్పారు.

ఆ తరువాత రోజు హేమ మీడియాతో మాట్లాడుతూ.. "నేనే చార్జిషీట్ చూడలేదు? మీరు ఎలా చూశారు? అందులో ఏముంది? ఎందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు? ఇక్కడి నుంచే అన్ని టెస్టులు చేయించవచ్చు, పాజిటివ్ వస్తే క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాను" అని ఓపెన్ చాలెంజ్ విసిరారు. హేమ చెప్పిన ఈ ఎమోషనల్ స్టోరీ, మాజీ పోలీస్ విచారణ, మీడియా ఫేక్ న్యూస్, వ్యక్తిగత బాధ్యతలు, ధైర్యం, నిజాయితీ అనే అంశాలను స్పష్టంగా వెలుగులోకి తీసుకువచ్చింది. ఆమె స్పందన సోషల్ మీడియాలో వైరల్ అయి, అభిమానులు, సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

More from Filmibeat

Read more about: tollywood actress hema drugs case
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X